Breaking News

పిల్లల్లో కూడా యాంగ్టయిటీ డిజార్డర్స్‌ ఉంటాయా?

Published on Sun, 11/12/2023 - 14:29

కవిత, కృష్ణలకు స్వీటీ ఒక్కగానొక్క కూతురు. అల్లారుముద్దుగా పెంచుతున్నారు. హైదరాబాద్‌లోని ఒక ఇంటర్నేషనల్‌ స్కూల్లో మూడో తరగతి చదువుతోంది స్వీటీ. అయితే గత నెలరోజులుగా కడుపు నొప్పి అంటూ బాధపడుతోంది. ముద్దుల కూతురు బాధపడుతుంటే చూడగలరా? వెంటనే కార్పొరేట్‌ హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. అక్కడ అన్ని పరీక్షలూ చేశాక ఏమీ లేదని చెప్పి, నాలుగు టాబ్లెట్లు ఇచ్చి పంపారు. ఆ తర్వాత మరో రెండుసార్లూ అలాగే జరిగింది. నాలుగోసారి హాస్పిటల్‌కి వెళ్లినప్పుడు అక్కడి చైల్డ్‌ స్పెషలిస్ట్‌ అసలు సమస్యను గుర్తించారు. పాప ఏ విషయంలోనో ఆందోళన పడుతోందని, అందుకే కడుపునొప్పితో బాధపడుతోందని, సైకాలజిస్ట్‌ని కలవమని చెప్పారు.

పిల్లల్లో కూడా యాంగ్టయిటీ డిజార్డర్స్‌ ఉంటాయా? అని విస్తుపోతూ.. అలా పిల్లలు బాధపడుతుంటే చూడలేమని .. ఏం చేయాలో చెప్పమంటూ కవిత, కృష్ణల్లాగే చాలామంది పేరెంట్స్‌ సైకాలజిస్ట్‌ సాయం కోరుతుంటారు. పిల్లల్లో కూడా యాంగ్జయిటీ డిజార్డర్స్‌ ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా 20 శాతం మంది పిల్లల్లో యాంగ్జయిటీ లక్షణాలు ఉన్నాయని ఒక అధ్యయనంలో తేలింది. పిల్లలు ఆందోళన ఎదుర్కోవడంలో తల్లిదండ్రులదే ప్రధానపాత్రనీ చాలా అధ్యయనాల్లో స్పష్టమైంది. మీ పిల్లల్లో ఆందోళన కనిపిస్తే మీరేం చేయాలో తెలుసుకుని, ఆచరించండి. తప్పకుండా ఫలితాలు కనిపిస్తాయి.

ఆందోళన చెందే పిల్లల్లో కనిపించే లక్షణాలు

  • కడుపునొప్పి, తలనొప్పి అంటూ ఫిర్యాదు చేయడం..
  • చిన్న చిన్న పనులకు లేదా అసలు ఏ పనీ చేయకపోయినా అలసిపోవడం..
  • చిరాకు, కోపం ఎక్కువగా ఉండటం..
  • నిద్రపోవడానికి కష్టపడటం..
  • ఏకాగ్రత లేకపోవడం..
  • చిన్న చిన్న విషయాలకే మితిమీరిన ఆందోళన..
  • కొన్ని విషయాలు లేదా పనులను నివారించడం.. 

నొప్పులుగా కనిపించే ఆందోళన
పిల్లల్లో భయాలు సహజం. కొందరు చీకటికి భయపడితే, మరికొందరు పేరెంట్స్‌కి దూరంగా ఉండాలంటే భయపడతారు. అయితే ఈ భయాలు స్కూలుకు వెళ్లడానికి, ఫ్రెండ్స్‌తో ఆడుకోవడానికి, నిద్రపోవడానికి ఎలాంటి ఇబ్బందులూ కలిగించవు. వయసు పెరిగేకొద్దీ చాలామంది పిల్లలు ఈ భయాలను అధిగమిస్తారు. కానీ కొందరిలో అలాగే కొనసాగుతాయి. పిల్లలు తమ భయాలను, ఆందోళనను వివరించలేరు. తమ ఆలోచనల్లోని అహేతుకతను గుర్తించలేరు, నియంత్రించలేరు. దాంతో కడుపునొప్పి, తలనొప్పి, అలసటరూపాల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. చిరాకు, కోపం పెరుగుతాయి. ఈ లక్షణాలు కనిపించినప్పుడు పిల్లలు ఆందోళన చెందుతున్నారని పేరెంట్స్‌ గుర్తించాలి. 

1. ఇంట్లోని అలారం కొన్నిసార్లు తప్పుగా మోగినట్లే, మెదడులోని అలారం కూడా కొన్నిసార్లు అవసరం లేకపోయినా ఆందోళన చెందేలా చేస్తుందని వివరించండి. అందులో పిల్లల తప్పేమీ లేదని, ఆందోళన చెందడం ‘చెడు’ కాదని చెప్పండి. 
2. బిడ్డ ఆందోళన చెందుతున్నప్పుడు పదేపదే ‘ఏమీ కాదు’అని అతిగా భరోసా ఇవ్వకండి. దేనివల్ల ఆందోళన చెందుతున్నారో గుర్తించి, వాటిని నివారించడానికి సహాయం చేయండి. 
3. స్కూలు ఎగ్గొట్టడానికి దొంగ వేషాలు వేస్తున్నావంటూ తిట్టకుండా, కొట్టకుండా వాళ్ల బాధ నిజమైనదేనని గుర్తించండి. తన బాధను మీరు అర్థం చేసుకున్నారని తెలపండి. 
4. పిల్లల ఆందోళనను గుర్తించి, సానుభూతి అందించిన తర్వాత, వారు ఆ భయాలను ఎదుర్కొనేందుకు అడుగులు వేసేలా చూడండి. అందుకోసం బిడ్డతోపాటు మీరూ పనిచేయండి. 
5. పిల్లలు తమ భయాలను విజయవంతంగా ఎదుర్కొన్నప్పుడు లేదా భయాలను ఎదుర్కోవడానికి అడుగులు వేసినప్పుడు మెచ్చుకోండి. ఒక్కొక్క అడుగుతో ఆందోళనను ఎదుర్కోగలవనే భరోసా ఇవ్వండి. 
6. చాలామంది పిల్లలు తమ చుట్టూ ఉన్న వాతావరణంలోని అనిశ్చితిని తగ్గించడం ద్వారా ఆందోళనను నివారించడానికి ప్రయత్నిస్తారు. అందుకే  పిల్లల చుట్టూ ఉన్న వాతావరణంలో అనిశ్చితిని వివరిస్తూ దాన్ని వాళ్లు  ఎదుర్కొనేందుకు, తట్టుకునేందుకు మీ పిల్లలకు సహాయపడండి.
7. మితిమీరిన నియంత్రణను పాటిస్తున్న  తల్లిదండ్రులకు ఆందోళనతో కూడిన బిడ్డ పుట్టే అవకాశం ఉందని పరిశోధన కనుగొంది. మితిమీరిన క్రమశిక్షణ పిల్లల విశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. అందుకే మీ బిడ్డ రిస్క్‌ తీసుకోవడానికి, తప్పులు చేయడానికి, సరిదిద్దుకోవడానికి స్వేచ్ఛనివ్వండి. 
8. ఇవన్నీ చేశాక కూడా మీ బిడ్డలో ఆందోళన తగ్గకపోతే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా సైకాలజిస్ట్‌ని కలవండి. కౌన్సెలింగ్, సైకోథెరపీ ద్వారా మీ బిడ్డకు సహాయపడతారు. 

సెకాలజిస్ట్‌ విశేష్‌

(చదవండి: చిన్నారులే నడుపుతున్న న్యూస్‌ చానెల్‌! వాళ్లే రిపోర్టింగ్‌, యాంకరింగ్‌..)

Videos

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)