Breaking News

ఆ మెడిసిన్‌తో ‍ దుష్ప్రభావాలే ఎక్కువ..!: టెక్‌ మిలియనీర్‌

Published on Fri, 01/10/2025 - 15:13

వృద్ధాప్యాన్ని(Anti-ageing) తిప్పికొట్టే ప్రాజెక్ట్‌ బ్లూప్రింట్‌ పేరుతో అమెరికన్‌ టెక్‌ వ్యవస్థాపకుడు బ్రయాన్ జాన్సన్(Bryan Johnson) కోట్లకొద్దీ డబ్బుని ఖర్చు చేసి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. యవ్వనంగా ఉండేలా జీవసంబంధమైన వయసును తిప్పికొట్టేందుకు నిత్యం వైద్యుల పర్యవేక్షణలో ఉంటూ..అత్యంత కఠినమైన డైట్‌ని అవలంభించేవాడు. ఇది ఒక రకంగా మనిషి దీర్ఘాయవుని పెంచడం ఎలా అనేదాన్ని సుగమం చేస్తుందని తరుచుగా చెప్పేవాడు బ్రయాన్‌. 

కానీ ఈ క్రమంలో కొన్ని చికిత్సలు వికటించి ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు  బ్రయాన్‌ స్వయంగా సోషల్‌మీడియాలో పేర్కొన్నారు కూడా. ఇప్పుడు తాజాగా మరో షాకింగ్‌ విషయాలన్ని వెల్లడించారు. తాను జీవ సంబంధ వయసును తిప్పికొట్టేలా తీసుకునే దీర్ఘాయువు(Longevity) మెడిసిన్‌ రాపామైసిన్‌(rapamycin)తో ప్రయోజనాలకంటే దుష్ప్రభావాలే ఎక్కువగా ఉన్నాయని  తెలిపారు. అందువల్ల తాను దీన్ని తీసుకోవడం ఆపేసినట్లు తెలిపారు. 

నిజానికి ఆయన గత ఐదు ఏళ్లుగా యవ్వనంగా ఉండేలా దీర్ఘాయువు కోసం ఈ రాపామైసిన్‌ను 13 మిల్లీ గ్రాముల చొప్పున తీసుకుంటున్నారు. ఇది శరీరంలోని రోగనిరోధక శక్తిని తగ్గిస్తుంది. వైద్యులు ఈ మెడిసిన్‌ని అవయవాల మార్పిడి చేయించుకున్న రోగులకు ఇస్తారు. ఎందుకంటే శరీరం కొత్తగా మార్పిడి చేసిన అవయవాన్ని తిరస్కరించకుండా.. వ్యాధి నిరోధక శక్తిని తగ్గించేలా ఈ మెడిసిన్‌ ఇవ్వడం జరుగుతుంది. 

అయితే ఈ మెడిసిన్‌ వల్ల దీర్ఘకాలం ఉండేలా చేసే ప్రయోజనాలకంటే దుష్ప్రభావాలే అధికంగా ఉన్నాయని  పరిశోధన(research)లో తేలడంతో ఈ రాపామైసిన్‌ మెడిసిన్‌ను ఉపయోగించడం ఆపేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. తన ప్రీ క్లినికల్‌ ట్రయల్స్‌లో ఈ మెడిసిన్‌ జీవితాంతం తీసుకుంటే..భారీ దుష్ప్రభావాలు తప్పవని వెల్లడవ్వడంతో తన వైద్య బృందం తక్షణమే ఆపేయాలనే నిర్థారణకు వచ్చిందని చెప్పుకొచ్చారు. 

అంతేగాదు ఈ రాపామైసిన్ మెడిసిన్‌ వల్ల లిపిడ్ జీవక్రియను దెబ్బతీసి ఇన్సులిన్‌పై ప్రభావం చూపుతుందని బ్రయాన్‌  వైద్య బృందం చెబుతోంది. తద్వారా గ్లూకోజ్‌ని బాడీ యాక్సెప్ట్‌ చేయకపోవడం లేదా పడకపోవడం జరుగుతుందన్నారు. తన వైద్య బృందం చేస్తున్న ఈ ప్రయోగాలన్నీ దీర్ఘాయువు పరిశోధనను అభివృద్ధి చేయడమేనని చెప్పారు.

 కాగా, ఈ వృద్ధాప్యాన్ని తిప్పి కొట్టే ‍ప్రయోగంలో భాగంగా ఇటీవలే కొన్ని నెలల క్రితం ప్లాస్మా మార్పిడి చేయించుకున్నారు. దీనికంటే ముందుకు కొడుకు రక్తాన్ని ఎక్కించుకున్నారు. ఇలా యవ్వనంగా ఉండేందుకు రకరకాల ప్రయోగాలకు, చికిత్సలకు ఇప్పటి వరకు దాదాపు రూ.17 కోట్లు పైనే ఖర్చు పెట్టారు బ్రయాన్‌.

(చదవండి: నో డౌట్‌ ఇలా చేస్తే..చచ్చినట్లు ట్రాఫిక్‌ రూల్స్‌ పాటిస్తారు..!)

 

Videos

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు