Breaking News

అలాంటి ఏకైక పోస్టాఫీస్‌ ఇదొక్కటే..  ఏడాదికి ఐదు నెలలే పని

Published on Tue, 12/12/2023 - 16:34

ప్రపంచానికి అత్యంత సుదూరాన మంచుదీవిలో నడుస్తున్న ఏకైక పోస్టాఫీసు ఇది. అంటార్కిటికాలోని పోర్ట్‌ లాక్రాయ్‌లో ఉన్న ఈ పోస్టాఫీసును యునైటెడ్‌ కింగ్‌డమ్‌ అంటార్కిటిక్‌ హెరిటేజ్‌ ట్రస్ట్‌ నిర్వహిస్తోంది. ఇది కేవలం పోస్టాఫీసు మాత్రమే కాకుండా, మ్యూజియమ్‌ కూడా. ప్రస్తుతం ఈ పోస్టాఫీసులో నాలుగు పోస్ట్‌ మాస్టర్‌ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టాఫీసు ఏడాదిలో ఐదు నెలలు మాత్రమే పనిచేస్తుంది.

ఇక్కడి ఖాళీలపై ఉద్యోగ ప్రకటన ఇటీవల వెలువడగానే ప్రపంచం నలుమూలల నుంచి వందలాదిగా దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఇందులో పనిచేసేవారు పోస్టాఫీసు బాధ్యతలతో పాటు మ్యూజియం నిర్వహణను కూడా చూసుకోవాల్సి ఉంటుంది. వాటికి తోడు ఇక్కడ పెద్దసంఖ్యలో ఉండే పెంగ్విన్లను లెక్కించడం కూడా వారి బాధ్యతే!

పెంగ్విన్లను లెక్కించడంలో నైపుణ్యం ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు అదనపు అర్హత. సూదూరంగా ఏకాంత ప్రదేశంలో ఉన్న ఈ పోస్టాఫీసులో పనిచేయడం ఏమంత ఆషామాషీగా ఉండదని, ఏటా నవంబర్‌ నుంచి మార్చి వరకు పనిచేసే ఈ పోస్టాఫీసులో ఇక్కడి వాతావరణాన్ని తట్టుకుంటూ పనిచేయడమే కష్టమని యునైటెడ్‌ కింగ్‌డమ్‌ అంటార్కిటిక్‌ హెరిటేజ్‌ ట్రస్ట్‌ సీఈవో కామిలా నికోల్‌ తెలిపారు.

ఇక్కడ రోజుకు పన్నెండు గంటల సేపు పనిచేయాల్సి ఉంటుందని, ఇప్పటి వరకు తమ ప్రకటనకు స్పందనగా రెండున్నర వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయని, ఇక్కడి వాతావరణాన్ని తట్టుకుని పనిచేసే శారీరక దారుఢ్యం, శాస్త్ర పరిశోధనల కోసం ఇక్కడకు వచ్చే పర్యాటకులతో తగిన రీతిలో మెలిగే కలివిడితనం, ఓర్పు, సహనం ఉన్న అభ్యర్థుల కోసం చూస్తున్నామని చెప్పారు. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)