Breaking News

అమ్మ ఆటో

Published on Wed, 09/17/2025 - 02:07

‘ఒంటరితనం అనేది బాధను వందరెట్లు చేస్తుంది’ అంటారు. భర్త చనిపోయిన తరువాత బాధపడుతూ ఒంటరితనంలో కూరుకుపోయింది సత్యవతి. ‘ఎప్పుడూ ఇంట్లో ఉండడం కంటే నలుగురిలో కలిస్తే అమ్మ కాస్త చురుగ్గా ఉంటుంది’ అని ఆలోచించాడు సత్యవతి కుమారుడు, ఆటోడ్రైవర్‌ గోపి. ఆ ఆలోచన ఫలితంగానే కుమారుడి ఆటోలో రోజూ అనేక ఊళ్లకు వెళుతుంటుంది సత్యవతి. పన్నెండేళ్ల కాలంలో ఆమెకు ఎంతోమంది ప్రయాణికులు పరిచయం అయ్యారు. బంధువులయ్యారు. అవును...ఇప్పుడు 84 ఏళ్ల సత్యవతి హుషారుగా ఉంటోంది. గోపి నడిపే ఆటోకు ‘అమ్మ ఆటో’ అని పేరు!

తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం యర్నగూడేనికి చెందిన మాసగాని సత్యవతి కుమారుడు గోపి ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. తండ్రి మరణంతో తల్లి బెంగగా ఉండడంతో ఆమెను తనతోపాటు ఆటోలో తీసుకు వెళ్లి కబుర్లు చెబుతూ తిప్పేవాడు. రోజూ ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 వరకు కొడుకుతోపాటు సత్యవతి ఆటోలోనే తిరుగుతుంది. తల్లి లేకుండా ఆటో స్టార్ట్‌ చేయడు గోపీ. ‘అసలే రోజులు బాగోలేవు. ఎక్కడ చూసినా రోడ్డు ప్రమాదాలే. ఇంట్లో ఉన్నప్పుడు గోపి గురించి భయంగా ఉండేది. ఇప్పుడు వాడి వెంటే ఉంటున్నాను కాబట్టి ఎలాంటి భయం లేదు. రోజూ ఆటోలో వెళ్లడం వల్ల ఎంతోమంది నాకు పరిచయం అయ్యారు. బంధువులు అయ్యారు’ సంతోషంగా అంటుంది సత్యవతి.

‘ఇంట్లో అమ్మ ఎప్పుడూ నాన్న గురించి ఆలోచిస్తూ బాధపడుతుంది అనే బెంగ ఒకప్పుడు ఉండేది. ఇప్పుడు అమ్మ నాతోపాటే ఉండడం వల్ల ఎలాంటి బెంగా లేదు. ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. నా వెనక అమ్మ ఉంది అనే ధైర్యం ఉంది’ అంటున్నాడు 52 ఏళ్ల గోపి. – కాసాని వెంకటేశ్వర్లు, సాక్షి, దేవరపల్లి, తూర్పుగోదావరి జిల్లా
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)