Breaking News

బుక్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌

Published on Fri, 09/18/2026 - 04:27

కొందరికి పుస్తకం చదవడం అంటే ‘వామ్మో’ అనుకునేంత భయం.  కొందరికి పుస్తకం చదవడం అంటే ‘ఆహా’ అనిపించే అనుభవం. కొన్ని సంవత్సరాల వరకు... అనంతి ఎప్పుడూ పుస్తకం చదివింది లేదు. ఒకసారి మాత్రం చదవాలనిపించి చదివింది. ఇక అంతే... అప్పటి నుంచి ఇప్పటివరకు ఆమె చదివిన పుస్తకాలు ఎన్నో, ఎన్నెన్నో! పుస్తక పఠనంపై ఆసక్తిని పెంచడానికి ‘ది బుక్‌ షో’ పేరుతో యూట్యూబ్‌ చానల్‌ ప్రారంభించి సక్సెస్‌ అయిన అనంతి అమెజాన్‌ పాపులర్‌ ఛాయిస్‌ బుక్‌ ఇన్‌ఫ్లూయెన్సర్‌గా ఎంపికైంది....

రేడియో జాకీగా ప్రయాణం మొదలుపెట్టిన చెన్నైకి చెందిన అనంతి ‘ది బుక్‌ షో’ అనే యూట్యూబ్‌ చానల్‌ వ్యవస్థాపకురాలిగా తన ప్రత్యేకత చాటుకుంది.
‘రేడియో జాకీగా కెరీర్‌ ప్రారంభంలో ఏదో ఒక విషయంపై మాట్లాడుతూనే ఉన్నాను. ఆ తరువాత దేని గురించి మాట్లాడాలో మాత్రం అర్థం కాలేదు. ఆ సమయంలోనే పుస్తకాలు చదవాలనిపించింది. ఒక్కటొక్కటిగా పుస్తకాలు చదవడం మొదలుపెట్టాను. నేను మొదట్లో చదివిన పుస్తకాల్లో కొన్ని... ది పవర్‌ ఆఫ్‌ యువర్‌ సబ్‌ కాన్షియస్‌ మైండ్, సీక్రెట్, సేపియన్స్‌’ అంటూ గతాన్ని గుర్తు తెచ్చుకుంది అనంతి.
పుస్తక ప్రియులను పుస్తక పఠన ప్రయాణంలో భాగం చేయడానికి ‘ది బుక్‌ షో’ పేరుతో యూట్యూబ్‌ చానల్‌ ప్రారంభించింది.

ఎన్నో పుస్తకాలు!
పుస్తకం పఠనంలో ఉండే మజాను పరిచయం చేయడమే కాకుండా, ఏ పుస్తకం చదివితే బాగుంటుంది అనే విషయంలో సలహాలు ఇస్తుంటుంది అనంతి. తనకు ఆసక్తి కలిగించిన పుస్తకాల గురించి వీడియోలు చేస్తుంటుంది. ఆ వీడియోలలో ఆ వారంలో తాను చదివిన పుస్తకాలు, పేజీల సంఖ్య, పుస్తకం చదవడానికి ఎన్ని రోజులు పట్టింది... మొదలైన వివరాలు చెబుతుంటుంది. ‘మీరు పరిచయం చేసిన పుస్తకాన్ని ఈమధ్యే చదివాను. చాలా బాగుంది’ అని అనంతితో ఎంతోమంది చెబుతుంటారు.

కలల ఇంధనం
రోజుకు కనీసం రెండు గంటల పాటు పుస్తకాలు చదువుతుంది అనంతి. గాలి చేసే శబ్దాలు వింటూనే కిటికీ పక్కన కూర్చొని సూర్యకాంతిలో పుస్తకాలు చదవడం అంటే అనంతికి ఇష్టం.

‘పుస్తక పఠనం అనేది కలలు కనడానికి ఇంధనాన్ని ఇస్తుంది’ అంటున్న అనంతి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన సైకాలజీ, సెల్ఫ్‌–హెల్ప్, ఫైనాన్స్, హ్యూమన్‌ బిహేవియర్‌... మొదలైన వాటికి సంబంధించి ఎన్నో పుస్తకాలను పరిచయం చేసింది.
 
చిన్న చిట్కా
కొత్తగా పుస్తకాలు చదవడం మొదలు పెట్టిన వారికి కొన్ని పేజీల తరువాత ఏకాగ్రత నిలుపుకోవడం కష్టంగా అనిపించవచ్చు. వారికి నేను ఒక చిన్న చిట్కా చెబుతాను. తక్కువ సమయంతో, ఉదాహరణకు రోజుకు పదినిమిషాలతో పుస్తకం చదవడం మొదలుపెట్టి ఆ సమయాన్ని మెల్లగా పెంచుకుంటూ వెళ్లండి. పుస్తకాలు చదవడం అలవాటు అయ్యాక మీకు ఇష్టమైన సబ్జెక్ట్‌ లేదా జానర్‌పై పుస్తకాలు చదవడానికి ఆసక్తి ప్రదర్శిస్తారు.
– అనంతి
 

Videos

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం

చంద్రబాబుపై వైఎస్ జగన్ సంచలన ట్వీట్

అప్పిరెడ్డికి భద్రత కూడా కల్పించలేమన్న జైలు అధికారులు

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బర్త్ డే సెలెబ్రేషన్స్

రామాయణ రికార్డుల జాతర

రామాయణం చిత్రంపై రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర పోస్ట్

బంగారం కొనాలా? వద్దా? రానున్న 15 రోజుల్లో ఏం జరగబోతుందంటే?

జైల్లోలేళ్ల అప్పి రెడ్డిని పరామర్శించిన అంబటి రాంబాబు

YSRCP ఏజెంట్లపై TDP నేతల దాడి.. రమేష్ గౌడ్ పరామర్శ

అత్తను పెండ్లి చేసుకున్న అల్లుడు

Photos

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)

+5

19 ఏళ్లకొకసారే ఇలా.. మంజుల బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

శ్రీకాంత్ కూతురిని చూశారా? ఎలా మెరిసిపోతోందో? (ఫొటోలు)

+5

జపాన్‌లో అత్తమామలతో కలిసి రష్మిక సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

టాలీవుడ్ సెలబ్రిటీస్ ఇంట్లో సందడిగా దీపావళి వేడుకలు (ఫొటోలు)

+5

బర్త్ డే ప్లస్ దీపావళి.. ఫ్యామిలీతో అనసూయ సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దివాళి ఫొటోలు పంచుకున్న భూమిక, ప్రగ్యా జైస్వాల్ (ఫొటోలు)

+5

దివాళి వేళ.. అనుపమ (ఫోటోలు)

+5

జాన్వీ ప్లాన్ చేసిన ఖుషి కపూర్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)