Breaking News

అనంత్‌ అంబానీ ప్రీ వెడ్డింగ్‌ వేడుకలు: వేలాదిమందికి అన్నదానం

Published on Thu, 02/29/2024 - 12:05

అంబానీ కుమారుడు అనంత్‌ అంబానీ  ప్రీ-వెడ్డింగ్‌ వేడుకలతో గుజరాత్‌లోని జామ్‌నగరం సందడిగా మారిపోతోంది.  జామ్‌ నగరం అనంగానే రిలయన్స్‌ అధినేత ముఖేశ్‌ అంబానీ నీతా అంబానీల కుమారుడు పెళ్లి జరుగుతున్న ప్రాంతం అని ఠక్కున చెప్పేలా వార్తల్లో నిలిచిపోయింది. ఆ వివాహ వేడుకకు ముందే ఆ నగరంలో ఏకంగా 14 దేవాలయాలను నిర్మించడంతో ఆ నగరం పేరు మరోసారి మారుమ్రోగిపోయింది. ఇక ప్రీ వెడ్డింగ్‌ వేడుకనే ఏకంగా అన్నదానంతో ప్రారంభించడంతో ఆ నగర సమీపంలోని గ్రామాల పేర్లు ఒక్కసారిగా తెరమీదకు వచ్చాయి. . ఈ కార్యక్రమంలో భాగంగా అంబానీల కుంటుంబం ఎంతమందికి బోజనాలందించిందంటే..

రిలయన్స్‌ ఇండస్ట్రీ అధినేత ముఖేష్‌ అంబానీ నీతా అంబానీల కుమారుడు అనంత్‌ అంబానీ ప్రీ వెడ్డిండగ్‌ వేడుకలు వచ్చే నెల మార్చి 1 నుంచి 3 వరకు జరగనున్న సంగతి తెలిసిందే. ప్రముఖ పారిశ్రామిక వేత్త వీరేన్‌ మర్చంట్‌ కుమార్తె రాధిక మర్చెంట్‌తో జులై 12 ఘనంగా వివాహం జరగనుంది. ఈ నేపథ్యంలో ముందుగా జరగనున్న ప్రీ వెడ్డింగ్‌ వేడుకలను ఇరు కుటుంబాలు అన్నదాన సేవతో ప్రారంభించారు. గుజరాతీ సంప్రదాయ వంటకాలతో స్థానికులకు భోజనాలు పెట్టారు. అనంత్‌ అంబానీ, రాధికా మర్చంట్‌ల వివాహం జయప్రదంగా జరిగేలా స్థానికుల ఆశీర్వాదం కోసం అంబానీ కుటుంబం అన్నసేవను ప్రారంభించింది.

ఈ అనదానాన్ని జామ్‌నగర్‌ రిలయన్స్‌ టౌన్‌షిప్‌ సమీపంలోని జోగ్వాడ్‌ గ్రామంలో నిర్వహించారు. ఈ అన్నదాన సేవలో రాధికా మర్చంట్‌ కుటుంభ సభ్యులు కూడా పాల్గొనడం విశేషం. సుమారు 51 వేల మంది స్థానికులకు అన్నదానం చేశారు.ఈ కార్యక్రమంలో భోజనానికి హాజరైన వారంతా జానపద సంగీతాన్ని ఆస్వాదించారు. ప్రముఖ గుజరాతీ గాయకుడు కీర్తిదాన​ గాధ్వి తన గాన ప్రదర్శనతో ఆకట్టుకున్నారు.

అలాగే ఫ్రీ వెడ్డింగ్‌ వేడుకలు కూడా సంప్రదాయబద్ధంగా జరగనున్నాయి. ఈ వేడుకల్లో పాల్గొనే అతిథులకు గుజరాత్‌లోని కచ్ఛ్‌ లాల్‌పూర్‌కు చెందిన మహిళా కళాకారులు తయారు చేసిన సంప్రదాయ కండువాలను అందజేస్తారు. ఇక ఈ ఫ్రీ వెడ్డింగ్‌ వేడుకల్లో  ఖతార్ ప్రధాని మహమ్మద్ బిన్ అబ్దుల్‌రహ్మాన్ బిన్ జాసిమ్ అల్ థానీ, భూటాన్ రాణి జెట్సన్ పెమా, మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్, అడోబ్ సీఈవో శంతను నారాయణ్, సౌదీ అరాంకో చైర్‌పర్సన్ యాసిర్ అల్ రుమయ్యన్ ఉన్నారు.

(చదవండి: అనంత్‌ అంబానీ అధిక బరువుకి కారణం ఇదే! కాబోయే భార్య..!)

Videos

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)