Breaking News

Anant - Radhika Cruise Party : షకీరా ఆట పాట, ఫీజు తెలిస్తే ఫ్యూజులెగిరిపోతాయ్‌!

Published on Tue, 05/28/2024 - 15:48

రిలయన్స్‌  అధినేత ముఖేష్ అంబానీ  నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ  తన  ప్రేయసి రాధికా మర్చంట్‌ను   జూలై 12, 2024న వివాహం చేసుకునేందుకు సిద్ధమవుతున్నాడు.  ఈ క్రమంలోనే ఈ ఏడాది మార్చిలో గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో స్టార్-స్టడెడ్ ప్రీ-వెడ్డింగ్ వేడుకను నిర్వహించారు. ఇపుడిక రెండోసారి ప్రీ వెడ్డింగ్‌ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం. బిలియనీర్‌ స్టేటస్‌కి తగ్గట్టుగా ఈసారి  ఇటలీలో క్రూయిజ్ షిప్‌లో నిర్వహిస్తుండటం విశేషం.

నాలుగు రోజుల ఈవెంట్‌ల గురించిన వివరాలతో నిండిన రెండవ ప్రీ-వెడ్డింగ్  ఇన్విటేషన్‌,  ప్లాన్‌, ఫోటోలు ఇంటర్నెట్‌లో హాట్‌ టాపిక్‌గా నిలిచాయి. తాజాగా మరో వార్త  హల్‌చల్‌ చేస్తోంది.  

పాపులర్‌ పాప్‌ సింగర్‌, పాటల రచయిత షకీరా అనంత్ రాధిక క్రూయిజ్ ప్రీ వెడ్డింగ్‌ ఈవెంట్‌లో ప్రదర్శన ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. తాజా నివేదికల ప్రకారం ఈ  ఈవెంట్‌ కోసం రూ.10-15 కోట్లు చార్జ్‌ చేయనుందని తెలుస్తోంది.

కాగా  ఇటలీలో మే 29 నుండి జూన్ 1, 2024 వరకు అనంత్ అంబానీ - రాధిక మర్చంట్‌ల రెండో ప్రీ-వెడ్డింగ్ వేడుకలు జరగనున్నాయి.  వెల్కం డిన్నర్‌, మే 30, 2024న 'రోమన్ హాలిడే' , 'లా డోల్స్ ఫార్ నియెంటె', 'టోగా పార్టీ'. ఆ తర్వాత, మే 31, 2024న ఆకాష్ అంబానీ శ్లోకా మెహతా కుమార్తె, వేద తొలి ఏడాది పుట్టినరోజు వేడుకలు  జరగనున్నాయి.  కొన్నిఇప్పటికే సల్మాన్‌ఖాన్‌, అలియా, రణబీర్‌దంపతులు, రణ్‌వీర్‌ సింగ్‌, క్రికెటర్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ ఫ్యామిలీ ఇటలీకి పయనమైన సంగతి తెలిసిందే. సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీలతోపాటు, పలువురు ప్రముఖులు దాదాపు 800మంది పాల్గొనే అవకాశం ఉంది. అయితే జామ్‌నగర్‌ ఈవెంట్‌ కోసం రూ.1259 కోట్లు, కేవలం  కేటరింగ్‌కే  ఏకంగా రూ. 210 కోట్లు ఖర్చు చేసిన అంబానీ కుటుంబం ఈ సారి ఎంత వెచ్చిస్తోంది అనే చర్చ జోరుగా సాగుతోంది. 
 

Videos

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)