Breaking News

అమిత  ప్రతిభ

Published on Fri, 04/11/2025 - 03:45

అడ్వర్‌టైజింగ్, సినిమా ఫీల్డ్‌ల గురించి అమ్మాయిలకు ఆసక్తి ఉంటే...‘అడ్వర్‌టైజింగ్‌ ఫీల్డ్‌కు వెళతావా! సినిమా ఫీల్డ్‌కు వెళతావా!!’ అని ఆశ్యర్యపోయే కాలం అది. అలాంటి కాలంలో అడ్వర్‌టైజింగ్‌ ఆ తరువాత ఫిల్మ్‌ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది ముంబైకి చెందిన అమిత మద్వాని.

‘ఏం తెలుసు అని ఇక్కడికి వచ్చావు!’ అని ఒకరు వెటకారం చేశారు. ‘తెలుసుకుందామనే ఇక్కడికి వచ్చాను’ అని సమాధానం ఇచ్చింది అమిత.
అవును... ఎన్నో దశాబ్దాలుగా ఆమె నేర్చుకుంటూనే ఉంది. ఆ నిరంతర ఉత్సాహమే అమితను అడ్వర్‌టైజింగ్, ఫిల్మ్‌ ఇండస్ట్రీలో విజయ కేతనం ఎగరేసేలా చేసింది.

తన కమ్యూనిటీలోని సాంస్కృతిక వేడుకలు, మారాఠీ నాటకరంగ ప్రభావం కళల పట్ల అమితలో ఆసక్తిని పెంచింది. 1980 దశకంలో అడ్వర్‌టైజింగ్‌ ఇండస్ట్రీలో పురుషాధిక్యత ఉన్న కాలంలో ఆమె తన కెరీర్‌ను మొదలు పెట్టింది. ‘ఇది నువ్వు ఎంచుకోవాల్సిన రంగం కాదు’ అంటూ కొద్దిమంది ఆమెను వెనక్కిలాగే ప్రయత్నం చేశారు. అయితే ఆమె ఉత్సాహంలో ఎలాంటి మార్పూ లేదు.

‘ఎన్ని సమస్యలు ఎదురైనా ఎదుర్కొంటాను’ అంటూ ముందుకు కదిలింది. నేర్చుకోవాలనే కుతూహలం ఆమె వేగంగా నడిచేలా చేసింది. ప్రారంభ రోజులు... కష్టపడడంలో ఉన్నప్రాముఖ్యత గురించి చెప్పాయి. ‘నేను ఎంచుకున్న ప్రయాణం అడుగడుగునా సవాలుతో కూడుకున్నదనే విషయం తెలిసినా రాజీ పడలేదు. సినిమా సెట్‌లో బ్యాగులు ΄్యాకింగ్‌ చేయడం దగ్గర్నుంచి 35 ఎం.ఎం. సినిమా ఎడిటింగ్‌ మెళకువలను అర్థం చేసుకోవడం వరకు ఎన్నో నేర్చుకున్నాను’ అంటుంది అమిత.

ఒగిల్వి, లియో బర్నెట్‌లాంటి అడ్వర్‌టైజింగ్‌ దిగ్గజ సంస్థలలో పనిచేయడం ఆమె అనుభవ జ్ఞానాన్ని విస్తృతం చేసింది. సినీ పరిశ్రమను అడ్వెర్‌టైజింగ్‌ ఏజెన్సీల కోణం నుంచి చూడడానికి ఆమెకు ఉపకరించాయి. క్యాంపెయిన్‌ బిల్డింగ్, క్లయింట్‌ సర్వీసింగ్, క్రియేటివ్, ప్రొడక్షన్‌ బృందాల మధ్య సమన్వయం.... ఇలా ఎన్నో విషయాలలో నైపుణ్యాన్ని సాధించింది.

ఈ అనుభవ, నైపుణ్యజ్ఞానంతో ‘ఈక్వినాక్స్‌ ఫిలిమ్స్‌’లో కో–వోనర్, నిర్మాతగా ప్రయాణం ప్రారంభించింది. మంచి పేరు తెచ్చుకుంది. కోవిడ్‌ మహమ్మారి సమయంలో వచ్చిన విరామంలో...‘ఏం చేస్తున్నాం? ఏం చేయకూడదు’ అనే కోణంలో ఆలోచించి సరికొత్త నిర్ణయాలు తీసుకుంది. అందులో ఒకటి... స్టోరీ టెల్లింగ్, డిజిటల్‌–ఫస్ట్‌ స్ట్రాటజీలను ఒకే వరుసలోకి తీసుకురావడం. భారీ బడ్జెట్‌తో కూడిన టెలివిజన్‌ వాణిజ్య ప్రకటనల నుంచి రీల్స్, డిజిటల్‌ ప్రకటనల ప్రస్తుత యుగం వరకు మన ప్రకటనల రంగంలో నాటకీయ మార్పులను అమిత ప్రత్యక్షంగా చూసింది.

‘విజయపథంలో ప్రయాణించాలంటే కష్టపడి పనిచేయడానికి సిద్ధంగా ఉండాలి. మరింత నేర్చుకోవాలి అనే ఆసక్తి ఉండాలి. వర్తమానం గురించే కాదు భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని కూడా ఆలోచనలు చేయాలి. నేను ఎంచుకున్న పని నన్ను ఎక్కడికి తీసుకువెళుతుందో తెలియదు. అయితే ఎప్పుడూ కొత్త విషయాలు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండేదాన్ని. మారుతున్న కాలానికి అనుగుణంగా నాలోని నైపుణ్యాలకు పదును పెట్టాను’ అంటుంది అమిత మద్వాని.


ప్రేక్షకులు కనెక్ట్‌ అయ్యేలా...
మనం ఎంచుకున్న మార్గం కఠినం, సవాళ్లతో కూడుకున్నది అయినప్పటికీ... నేర్చుకోవాలి, తెలుసుకోవాలి అనే తపన ఉంటే విజయం సాధించవచ్చు. నేను అడ్వర్‌టైజింగ్, ఫిల్మ్‌ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పుడు ఏమీ తెలియదు. చాలా ఓపికగా నేర్చుకున్నాను. పది సెకన్ల డిజిటల్‌ స్పాట్‌ అయినా, మూడు గంటల ఫీచర్‌ ఫిల్మ్‌ అయినా ప్రేక్షకులు కనెక్ట్‌ అయ్యేలా చూడడమే ప్రధానం. సోషల్‌ మీడియా ఫ్రెండ్లీ ఫార్మట్‌లను ఏకీకృతం చేయడం ద్వారా, ప్రేక్షకులకు ఎండ్‌–టు–ఎండ్‌ పరిష్కారాలను అందించడం ద్వారా ఈక్వినాక్స్‌ ఫిల్మ్స్‌ ముందంజలో ఉంది. టీమ్‌ అంకితభావం మా విజయానికి కారణం.
– అమిత మద్వాని 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)