Breaking News

అరుదైన వేడుక ‘ఈస్టర్న్‌ మహా కుంభమేళా’..!

Published on Sun, 06/22/2025 - 10:29

అస్సాంలో జరిగే ‘అంబుబాచీ మేళా’ అరుదైన వేడుక. గువాహటిలో కొలువైన శక్తిపీఠం కామాఖ్య దేవి ఆలయంలో ఏటా జరిగే ఈ మేళా ఒక విలక్షణ ఆధ్యాత్మిక ఉత్సవం. ఇది ‘ఈస్టర్న్‌ మహా కుంభమేళా’గా ప్రసిద్ధి చెందింది, ప్రకృతిని, స్త్రీ శక్తిని ఆరాధించే ఈ మేళా పురాతన శాక్తేయ సంప్రదాయానికి, అస్సామీ సంస్కృతికి ప్రతీక.

అంబుబాచీ మేళా అనేది కామాఖ్యదేవి రుతుచక్రాన్ని సూచిస్తుంది. ఈ సమయంలో దేవి గర్భగుడిలో ఉన్న యోని పీఠం నుంచి రుతుస్రావం జరుగుతుందని విశ్వసిస్తారు. ఈ కాలాన్ని భూమి తన పునరుత్పత్తి శక్తిని తిరిగి పొందే సమయంగా భావిస్తారు. ఈ నాలుగు రోజులు ఆలయాన్ని మూసివేసి ఉంచుతారు. ఈ కాలంలో ఏ విధమైన వ్యవసాయ పనులు, పూజలు, శుభకార్యాలు నిర్వహించరు. ఐదోరోజు శుద్ధి కార్యక్రమం నిర్వహించిన తర్వాత, ఆలయం తిరిగి తెరిచి, దర్శనం చేసుకోవడానికి భక్తులను అనుమతిస్తారు. అంబుబాచీ మేళా ఈ ఏడాది జూన్‌ 22న ప్రారంభమై జూన్‌ 26న ముగుస్తుంది.

ఈ మేళాలో పాల్గొనడానికి దేశం నలుమూలల నుంచి, ముఖ్యంగా హిమాలయాల నుంచి వేలాదిమంది సన్యాసులు, అఘోరాలు, తాంత్రికులు వస్తారు. వీరి దర్శనం, ఆశీర్వచనాల కోసం భక్తులు బారులు తీరుతుంటారు. ఈ నాలుగు రోజులు ఆలయాన్ని మూసివేసినా, పరిసరాలన్నీ మంత్ర పఠనాలతో, భజనలతో, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో హోరెత్తుతాయి. మేళా ముగిసిన తర్వాత, దేవి ‘శుద్ధి’ అయినప్పుడు, భక్తులకు ప్రత్యేకమైన ‘అంబుబాచీ వస్త్రం’ లేదా ‘అంబుబాచీ సిందూరం’ ప్రసాదంగా ఇస్తారు. ఈ వస్త్రం దేవి రుతు రక్తంతో తడిసిందని నమ్ముతారు.  

(చదవండి: అక్కడ ప్రతిరోజూ.. క్రిస్మస్‌ వేడుకే..!)

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)