Breaking News

'బిర్యానీ' పూర్తిగా మాంసం ఆధారిత వంటకమా?

Published on Mon, 03/24/2025 - 16:23

ఆహార ప్రియులకు ఇష్టమైన వంటకాల్లో అగ్రస్థానం బిర్యానీదే. అంతేగాదు ఆన్‌లైన్‌ ఎక్కువ ఆర్డర్‌ చేసేది కూడా బిర్యానీ. అయితే ఈ వంటకం ఇరాన్‌లో ఉద్భవించిందని, మొఘల్ పాలన కారణంగా భారత ఉపఖండంలో నెమ్మదిగా భాగమైందని చెబుతుంటారు పాక నిపుణులు. ఆ విధంగా మనకు బిర్యానీ తెలిసిందేనది చాలామంది వాదన. అయితే అసలు బిర్యానీ అంటే మాంసంతో కలిపి చేసేదే బిర్యానీ అని, కూరగాయలతో చేసే వెజ్‌ బిర్యానీ అనేది బిర్యానీనే కాదని అంటున్నారు. నెట్టింట దీనిపై పెద్ద చర్చ నడుస్తోంది. మరీ ఇంతకీ వెజ్‌ బిర్యానీ అనేది ఉందా..?. మాంసం ఆధారిత వంటకమే బిర్యానీనా అంటే..

వెజ్‌ లేదా నాన్‌ వెజ్‌ బిర్యానీ రెండూ వాటి రుచి పరంగా ఎవర్‌ గ్రీన్‌ అనే చెప్పొచ్చు. అయితే పాక నిపుణులు మాత్రం బిర్యానీ అనగానే మాంసంతోనే చేసే వంటకమని నమ్మకంగా చెబుతున్నారు. కానీ మరికొందరు మాత్రం కూరగాయలతో చేసినదే బిర్యానీ అని వాదిస్తున్నారు. ప్రముఖ చెఫ్‌లు పాక నిపుణులు బిర్యానీని పూర్వం సుగంధ ద్రవ్యాల తోపాటు, జంతువుల కొవ్వుని కూడా జోడించి మరింత రుచిని తీసుకొచ్చారని చెబుతున్నారు. 

అందువల్ల మాంసం లేకుండా తయారుచేసిన వంటకాన్ని నిజంగా "బిర్యానీ"గా పరిగణించలేమని అన్నారు. అయితే కాలక్రమే ఆహార వంటకాలు అభివృద్ధి చెందడంతో.. మాసంహారం తినని వాళ్ల కోసం ఇలా కూరగాయలు జోడించి చేయడంతో అది కాస్త వెజ్‌ బిర్యానీగా పిలవడం జరిగిందన్నారు. అయితే అది నిజమైన బిర్యానీ కాదని తేల్చి చెబుతున్నారు  ప్రముఖ చెఫ్, ఫుడ్ ల్యాబ్ వ్యవస్థాపకుడు సంజ్యోత్ కీర్. 

అలాగే కూరగాయలు జోడించినంత మాత్రమే దానికి బిర్యానీ ఘమఘలు రావని, దానికి సుగంధ ద్రవ్యాలు తోడైతేనే.. కూరగాయలు రుచిగా మారి మనకు అద్భుతమైన వెజ్‌ బిర్యానీ సిద్ధమవుతుందని చెప్పారు. అందువల్ల కూరగాయలతో చేసినదాన్ని బిర్యానీగా పరిగణించరని అన్నారు. 

చాలామందికి ఇది నచ్చకపోయినా..వాస్తవం ఇదేనని అన్నారు. అలా అని వెజ్‌ బిర్యానీని కూడా తీసిపారేయలేం. ఎందుకంటే  కాటేజ్ చీజ్ (పనీర్), సోయా బీన్, టోఫు, పుట్టగొడుగులు, జాక్‌ఫ్రూట్ (కథల్) లేదా ఖర్జూరం (ఖజూర్) వంటి కూరగాయలతో  మరింత రుచికరంగా చేస్తున్నారు చెఫ్‌లు. చెప్పాలంటే..మాంసంతో చేసినన బిర్యానీ రుచి కూడా దానిముందు సరిపోదేమోనన్నంత టేస్టీగా ఉంటోందన్నారు చెఫ్‌ సంజ్యోత్ కీర్. 

(చదవండి: యూట్యూబ్‌ చూసి సెల్ఫ్‌ సర్జరీ..! వైద్య నిపుణుల స్ట్రాంగ్‌ వార్నింగ్‌)
 

 

#

Tags : 1

Videos

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినానో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)