Breaking News

అందాల రాణి ఐశ్వర్య రాయ్‌ బ్యూటీ సీక్రెట్‌ ఇదే..!

Published on Fri, 11/08/2024 - 15:42

బాలీవుడ్‌ నటి ఐశ్వర్య రాయ్‌ బచ్చన్‌ అందానికే ఐకానిక్‌గా ఉండే సౌందర్యం ఆమె సొంతం. ఎంతమంది అందగత్తలైన ఆమెకు సాటి రారు. అలాంటి అద్భుతమైన అందం ఆమెది. ఐదుపదుల వయసులో కూడా అంతే గ్లామర్‌గా ఉండటం విశేషం. ఎక్కడ ఐశ్వర్యరాయ​ కనిపించినా..అందాల రాణి వస్తుందని ఆత్రంగా చూస్తారు. అంతటి ఆకర్షణీయమైన అందాన్ని మెయింటైన్‌ చేసేందుకు ఐశ్వర్య ఏంచేస్తుందో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు కూడా. అంతేగాదు ప్రతి మహిళ చర్మ సంరక్షణ కోసం ఏం చేయాలో కూడా చెప్పారామె. ఇంతకీ అవేంటో చూద్దామా..!.

మాజీ మిస్‌ ఇండియా ఐశ్వర్య రాయ్‌ ఇప్పటికి అంతే ఫిట్‌గా అందంగా కనిపిస్తారు. ఎక్కడ మచ్చ్చుకైనా..వృద్ధాప్య ఛాయలు కానరావు. అంతలా మేని ఛాయ మెరుస్తూ ఉండేందుకు ఐశ్వర్య ఎంతో కేర్‌ తీసుకుంటానని చెప్పారు. ఆరోగ్యం కోసం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటామో అలాగే చర్మ సంరక్షణ కూడా అంతే ముఖ్యమని అంటోంది ఐశ్వర్య రాయ్‌. 

తాను కూడా ప్రతి భారతీయ మహిళ ఎలా ఉంటుందో తాను అలానే ఉంటానన్నారు. "అయితే ఆత్మగౌరవంతో, సరైన వ్యక్తిత్వంతో బతకాలి. ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రతి స్త్రీ తన ఆత్మగౌరవాన్ని చంపుకుని జీవించాల్సిన పనిలేదు. అదీగాక మహిళలు నిద్ర లేచిన దగ్గర నుంచి గడియారంలోని ముల్లుకంటే వేగంగా ఆగకుండా పనిచేస్తూనే ఉంటారని అన్నారు. 

అందువల్ల కనీసం కొద్దిసేపైనా మీ కోసం సమయం కేటాయించడం అత్యంత ముఖ్యం. హైడ్రేటెడ్‌గా పరిశుభ్రంగా ఉండేందుకు ప్రయత్నించండి. మీ గౌరవాన్ని ఇనుమడింప చేసే అందంపై దృష్టి పెట్టండి. అందులో ఎలాంటి తప్పు లేదు. తప్పసరిగా  మొటిమలు, అలెర్జీలు వంటి బారిన పడకుండా స్కిన్‌కేర్‌లు వాడలన్నారు. తప్పనసరిగా మాయిశ్చరైజర్‌లను వాడమని సూచించింది. వంటపనులతో సతమతమయ్యే మహిళలు తమ చర్మ ఆరోగ్యం కోసం మాయిశ్చరైజర్లు వాడాలని అన్నారు." ఐశ్వర్యరాయ్‌.

(చదవండి: 'తుప్పా దోస విత్‌ చమ్మంతి పొడి' గురించి విన్నారా?)

 

Videos

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)