Breaking News

పట్టెడ అంచు చీర.. ఈ పేరు విన్నారా?

Published on Fri, 06/16/2023 - 11:58

మనింట్లో ఓ తొంభై ఏళ్ల నానమ్మ కానీ అమ్మమ్మ కానీ ఉందా? ఉంటే ఆమెనడగండి ఓ మాట. వాళ్ల యువతరాన్ని ఆకట్టుకున్న చీరలేమిటి అని. ఎంతో ఉత్సాహంగా ఇప్పుడు మనం వినని ఎన్నో పేర్లు చెబుతారు. ఓ పది రకాల పేర్లు చెప్పి ‘ఇప్పుడా నేత ఎక్కడ వస్తోంది. వచ్చినా ఈ తరంలో ఆ చీరలెవరు కట్టుకుంటారు. నేయడమే మానేసినట్లున్నారు’ అని నిరుత్సాహంగా ముగిస్తారు. సరిగ్గా అలాంటి చీరలకు పూర్వ వైభవం తెస్తున్నారు కర్నాటకకు చెందిన హేమలత. హ్యాండ్‌లూమ్‌ లవర్స్‌ వార్డ్‌రోబ్‌లు రెండు వందల ఏళ్ల నాటి చేనేతలతో అలరారుతున్నాయి. 

ఎటు కట్టినా ఓకే! 
హేమలత... యూఎస్‌లోని కన్సాస్‌ యూనివర్సిటీలో ఉన్నతవిద్య పూర్తి చేశారు. ఆమెకు మన చేనేత కళలో దాగిన సమున్నత జ్ఞానం మీద దృష్టి పడింది. ఒకదానికి ఒకటి విభిన్నంగా దేనికది ఒక శాస్త్రబద్ధమైన గ్రంథంలాంటి చేనేతల మీద అధ్యయనం మొదలు పెట్టారామె. నిఫ్ట్‌ (నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ)లో ఇదే అంశం మీద పీహెచ్‌డీ చేస్తున్నారు. గిరిజనులు నివసించే ప్రదేశాల్లో విస్తృతంగా పర్యటించారు.

వారి నేత తీరును పరిశీలించారు. ఈ క్రమంలో హేమలతా జైన్‌ 85 ఏళ్ల దేవదాసిని కలిశారు. ఆమె దగ్గరున్న పట్టెడ అంచు చీర రెండు వందల ఏళ్ల నాటి చేనేత కళ. ఈ చీరకు రెండు కొంగులుంటాయి. చీరను రెండువైపులా కట్టుకోవచ్చు. రివర్సబుల్‌ శారీ అన్నమాట. పదవ శతాబ్దంలో గజేంద్రఘర్‌ జిల్లాలోని గ్రామాల్లోని చేనేతకారులు ఈ చీరలను నేసేవారు. అలాంటి చీరలిప్పుడు మార్కెట్‌లో లేవు. ఈ తరంలో ఎవరి దగ్గరా లేవు. ఆ చీరను చూపించి మరొక చీర తయారు చేయించాలంటే ఆ రకమైన నేత నేసే చేనేతకారులు కూడా లేరన్న మరో వాస్తవం తెలిసి వచ్చిందామెకు. అలాంటి అంతరించిపోతున్న డిజైన్‌లు 45 వరకు ఉన్నాయి.  

(చదవండి: ముఖ సౌందర్యంపై పెరుగుతున్న మోజు)

  

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)