నా అందానికి కారణం ఆ అలవాటే : రుహానీ శర్మ బ్యూటీ సీక్రెట్‌

Published on Sun, 04/20/2025 - 15:58

అనుష్కా శర్మ చెల్లెలు, విరాట్‌ కోహ్లీ మరదలు అయిన రుహానీ శర్మ చేసినవే తక్కువ సినిమాలు అయితే, అందులో హిట్‌ అయిన వి రెండు మాత్రమే! కాని, సోషల్‌ మీడియాలో తన ఫాలోవర్స్‌ సంఖ్య మాత్రం లక్షల్లో ఉంటుంది. ఫ్యాషన్‌లో తను చూపే చూజీనెస్‌ మిగతా వారికంటే తనని భిన్నంగా చూపిస్తోంది. అలా తను ఎంచుకున్న బ్రాండ్స్‌లో ఇవీ ఉన్నాయి. 

రోజూ ఎంత బిజీగా ఉన్నా రాత్రి పడుకునే ముందు నా సౌందర్యం గురించి జాగ్రత్తలు తీసుకోవటం మాత్రం మర్చిపోను. ఇప్పుడు ఆ అలవాటే నన్ను ఎల్లప్పుడూ అందంగా కనిపించేలా చేస్తోంది.– రుహానీ శర్మ

చేతి గాజులు ఘల్లుమన్నవే..
ఒకప్పటిలాగా నిత్యం చేతికి గాజులు వేసుకోకపోవచ్చు. కాని, స్పెషల్‌ అకేషన్‌ ఏదైనా మట్టిగాజులపైనా మనసు పారేసుకుంటున్నారు నేటి మగువలందరూ చేతికి నిండుగా మట్టి గాజులు వేసుకుంటే వచ్చే అందమే వేరు. పైగా గాజుల్ని శుభసూచకంగా, సౌభాగ్యానికి గుర్తుగా భావిస్తారు. వీటిని ధరించడం వలన అందంతో పాటు, ఆరోగ్యమూ చేకూరుతుందనే నమ్మకమూ ఉంది. 

బంగారు గాజులు ఎన్ని వేసినా వాటి మధ్యలో ఓ నాలుగు మట్టిగాజులు చేరితేనే అందం. కిందటి రోజుల్లో మట్టిగాజులు అంటే ఎరుపు, ఆకుపచ్చ, నీలం రంగుల్లో సాదాగా దొరికేవి. కాని, ఇప్పుడు పేస్టల్‌ కలర్స్‌తో పాటు దాదాపు అన్నీ రంగుల్లోనూ, వివిధ రకాల డిజైన్స్‌లోనూ లభిస్తున్నాయి. వీటిని అటు అరడజను, ఇటు అరడజనులా కాకుండా ప్రస్తుతం ఉన్న ట్రెండ్‌ తగ్గట్టు, కేవలం ఒక్క చేతికే నిండుగా ధరించి కూడా స్టయిలింగ్‌ చేసుకోవచ్చు నటి రుహానీ శర్మలా. 

-దీపిక కొండి


 

Videos

కర్నూలు జిల్లాలో కొనసాగుతున్న టీడిపీ గూండాల దౌర్జన్యాలు

ఉద్యోగులకు, పెన్షనర్లకు భారీ శుభవార్త.. దీపావళి కానుకగా డీఏ పెంపు..?

70 ఏళ్లపైనే ఉన్నావ్.. లుచ్చా పనులు ఆపేయ్! JCకి పెద్దారెడ్డి మాస్ వార్నింగ్

నా 25ఏళ్ల సన్నిహితంతో చెప్తున్న.. లోకేష్ వల్ల TDP భూస్థాపితం అవ్వడం తథ్యం

చూస్కుందాం...! నువ్వా... నేనా...

వృద్ధుడిని కూడా వదలరా? సొంత పార్టీ నేతలపై టీడీపీ గూండాల దాడులు

26నుంచి భారీ వర్షాలు

మహిళల జుట్టు పట్టుకోవడం, చీరలు లాగడం ఏ రకమైన పాలనకు నిదర్శనం?

దాడుల వెనుక టార్గెట్.. రెడ్డి వర్గం..! ఇంద్రనీల్ సంచలన నిజాలు

ముంచుకొస్తున్న అర్ణబ్ తుపాను

Photos

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)