Breaking News

ఆలియా భట్‌ ఆరోగ్య వంటకాలు, తినరా మైమరిచి అంటారు!

Published on Sat, 11/09/2024 - 12:27

ఆలియా భట్‌ కేవలం నటి మాత్రమే కాదు. ఫిట్‌నెస్,  పోషకాహారానికి సంబంధించిన వెల్‌నెస్‌ ఐకాన్‌ కూడా. ఆమె ఆరోగ్యకరమైన జీవనశైలితో మిలియన్ల మందికి స్ఫూర్తినిస్తుంది. 2020లో సోషల్‌మీడియా ద్వారా అలియా తన వంటగదిలోకి అభిమానులను తీసుకు వెళ్లింది. శరీరానికి ఇంధనంగా, ఫిట్‌గా ఉండేలా సులభమైన,  పోషకాహార వంటకాలను ఎంచుకుంటుంది. వాటిలో బీట్‌రూట్‌ సలాడ్, సొరకాయ సబ్జీ, చియా పుడ్డింగ్‌.. పరిచయం చేస్తోంది. 

 

బీట్‌రూట్‌ సలాడ్
కావలసినవి: తురిమిన బీట్‌రూట్, పెరుగు, నల్ల మిరియాలు, చాట్‌ మసాలా, కొత్తిమీర, నల్ల ఆవాలు, ఇంగువ, కరివేపాకు, జీలకర్ర. 

తయారీ: ఒక గిన్నెలో పై పదార్థాలన్నీ వేసి కలపాలి. మూకుడులో టీ స్పూన్‌ నూనె వేడి చేసి, జీలకర్ర, ఇంగువ, ఆవాలు, కరివేపాకు వేసి పోపు పెట్టాలి. దీనిని బీట్‌రూట్‌ మిశ్రమంలో వేసి కలిపి, సర్వ్‌ చేయాలి.  

ఆరోగ్య ప్రయోజనాలు: బీట్‌రూట్‌లో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కణాలు దెబ్బతినకుండా కాపాడతాయి. రక్తపోటును నియంత్రిస్తాయి. జీర్ణక్రియను, మెదడు, ఎముక, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి, అలాగే బరువు నిర్వహణలో కూడా సహాయపడతాయి.

సొరకాయ సబ్జీ
కావలసినవి: సొరకాయ, నూనె, నల్ల ఆవాలు, ఇంగువ, కరివేపాకు, పచ్చిమిర్చి, ధనియాల  పొడి, జీలకర్ర పొడి సోపు పొడి ఆమ్చూర్‌ పొడి, ధనియాలు, తురిమిన కొబ్బరి.

తయారీ: మూకుడులో టేబుల్‌స్పూన్‌ నూనె వేడి చేసి ఇంగువ, కరివేపాకు, కారం వేసి పోపు సిద్ధం చేయాలి. అందులో తురిమిన సొరకాయ, ఉప్పు వేసి కలపాలి. n 2–3 నిమిషాలు అలాగే ఉంచి ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఆమ్‌చూర్‌ ΄పొడి సోపు పొడి వేసి కలపాలి. n చివరిగా కొబ్బరి తురుము, తాజా కొత్తిమీర ఆకులు చల్లాలి. వేడి వేడిగా వడ్డించాలి.

ఆరోగ్య ప్రయోజనాలు: జీర్ణక్రియ పనితీరు బాగుంటుంది. గుండె ఆరోగ్యం, రక్తంలో చక్కెర నియంత్రణ, పటిష్టమైన రోగనిరోధక వ్యవస్థ, బరువు నిర్వహణకు మద్దతు వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. 

చియా పుడ్డింగ్‌ 
కావలసినవి: చియా గింజలు, పాలు,  ప్రొటీన్‌ , పౌడర్, రుచికి స్టేవియా. తయారీ: ఒక గిన్నెలో చియా గింజలు, పాలు,  ప్రొటీన్‌ , పౌడర్  కొన్ని చుక్కల స్టెవియా వేసి బాగా కలపాలి. ఫ్రిజ్‌లో ఉంచి చల్లగా సర్వ్‌ చేయాలి. ఆరోగ్య ప్రయోజనాలు: చియా పుడ్డింగ్‌ ΄ పోషకాలు సమృద్ధిగా గల అల్పాహారం. ఫైబర్,   ప్రొటీన్, ఒమేగా–3 కొవ్వు ఆమ్లాలు, విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి.కావలసినవి: చియా గింజలు,  పాలు,  ప్రొటీన్‌ ΄ పౌడర్, రుచికి స్టేవియా. 

తయారీ: ఒక గిన్నెలో చియా గింజలు, ΄ పాలు, ప్రొటీన్‌ ΄పౌడర్, కొన్ని చుక్కల స్టెవియా వేసి బాగా కలపాలి. ఫ్రిజ్‌లో ఉంచి చల్లగా సర్వ్‌ చేయాలి. 

ఆరోగ్య ప్రయోజనాలు: చియా పుడ్డింగ్‌  పోషకాలు సమృద్ధిగా గల అల్పాహారం. ఫైబర్, ప్రొటీన్, ఒమేగా–3 కొవ్వు ఆమ్లాలు, విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి.


 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)