Breaking News

నా బుగ్గల్లో ప్లాస్టిక్‌ ఏం లేదు!

Published on Tue, 10/29/2024 - 05:51

అందమైన నయనాలే కాదు వాటికి పైన ఉండే కనుబొమలతోనూ ముఖ కవళికల్లో మార్పులు తీసుకురావడం సాధ్యమేనా?! అని అడిగితే సాధ్యమే అంటోంది నటి నయనతార. ముఖాకృతిలో మార్పులకు కనుబొమలు కీలకమైనవి అంటోందామె.

జవాన్‌ చిత్రంలో షారుఖ్‌ ఖాన్‌ సరసన బాలీవుడ్‌లోకి అడుగుపెట్టినప్పటి నుంచి దేశవ్యాప్తంగా నయనతార ఇమేజ్‌ పెరుగుతూ వచ్చింది. దీంతో ఆమెలో వచ్చిన మార్పును సూచిస్తూ పాత, కొత్త ఫోటోలు పెట్టి, నయన్‌ ముఖానికి ప్లాస్టిక్‌ సర్జరీ, సన్నబడటానికి లై పోసక్షన్‌ చేయించుకుందని సోషల్‌ మీడియాలో కామెంట్స్‌ చేస్తున్నారు కొందరు. 

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె ఈ పుకార్లకు స్పందించి, కనుబొమల తీరులో, ఆహారంలో మార్పులు చేసుకోవడం వల్లనే ఇది సాధిస్తున్నానని, ఇందుకు ΄్లాస్టిక్‌ సర్జరీ అవసరమే లేదని తెలిపింది. 

‘ఇది నిజమైన గేమ్‌ ఛేంజర్‌. నా కనుబొమలలో మార్పులు తీసుకురావడం నాకు చాలా ఇష్టం. కొన్నేళ్లుగా విభిన్న రకాల కనుబొమలను ట్రై చేస్తూ వచ్చాను. అది ఇప్పుడు వర్క్‌ ఔట్‌ అయిందనుకుంటా! అలాగే సన్నగా కనిపించేందుకు లైపోసక్షన్‌ చేయించుకున్నాననే వార్తలు కూడా వచ్చాయి. కానీ, అది నిజం కాదు. ఆహారాన్ని బట్టి బరువు హెచ్చుతగ్గుల్లో చాలా మార్పులు తీసుకురావచ్చు. ఆ మార్పుల్లో భాగంగా ఒకసారి నా బుగ్గలు లోపలికి వెళ్లినట్టు, మరోసారి బయటికి వచ్చినట్టు కనిస్తాయి. కావాలంటే నా బుగ్గలను నొక్కి చూడవచ్చు, వీటిలో ΄్లాస్టిక్‌ లేదు’ అంటూ నవ్వుతూ సమాధానమిచ్చింది నయన్‌.  

Videos

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)