Breaking News

Bhagavad Gita: అసలైన ఆస్తికులు

Published on Sat, 02/01/2025 - 14:36

కొండలు, కోనలు, అడవులు, పక్షులు, పశువులు, సూర్యచంద్రులు, నక్షత్రాలు, గ్రహాలు-ఇవన్నీ మనల్ని ప్రేరేపిస్తాయి. ఏకాగ్రచిత్తంతో ప్రకృతిని పరిశీలిస్తూ పోగా, పోగా అది అద్భుతం అనిపిస్తుంది! ఎంతో విజ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ప్రకృతి పరిశీలకులుగా ఆరంభించి ఆ ప్రకృతి ప్రేమికులుగా, ఆరాధకులుగా మారిపోతాం. దత్తా త్రేయుని లాగా, ఆంగ్లకవి విలియం వర్డ్స్‌వర్త్‌ లాగా ప్రకృతిని మన గురువుగా, దైవంగా పరిగణిస్తాం. అయితే అక్కడే ఆగిపోతే కేవలం హేతువాదులుగా, భౌతిక వాదులుగా మిగిలిపోతాం. లేదా నాస్తికులుగా మిగిలిపోయే అపాయం కూడాఉంది. 

భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: ‘‘భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, మనసు, బుద్ధి, అహంకారం అని నా ప్రకృతి ఎనిమిది విధాలుగా ఉది. ఈ ప్రకృతిని ‘అపరా’ లేక ‘జడ ప్రకృతి’ అని అంటారు. ఇది కాక ఈ సంపూర్ణ జగత్తును ధరించునట్టి మరొకప్రకృతి ఉంది. అదే నా జీవ రూప పరాప్రకృతి’ లేక ‘చేతన ప్రకృతి’ అని తెలుసుకో’’ (భగవద్గీత 7–అ 4, 5 శ్లోకాలు).

అంటే... జడప్రకృతి, చేతనా ప్రకృతి అనేవి దైవం అనే నాణేనికి రెండు వైపులన్నమాట (బొమ్మ, బొరుసు)! జడప్రకృతిని పరిశీలించి,ప్రేమించి, ఆరాధిస్తున్నవారు అంతటితో తృప్తి పడక చేతనా ప్రకృతిని కూడా పరిశీలించి, పరిశోధించటానికి పరిశ్రమిస్తే– అంటే రెండో వైపును కూడా చూడటానికి ప్రయత్నించి చూస్తే వారే దార్శనికులు, ద్రష్టలు, ఋషులు అవుతారు; పరిపూర్ణ ఆస్తికులవుతారు. అయితే తమాషా ఏంటంటే కొంతమంది కనపడే ప్రకృతిని మాత్రమే నమ్మి నాస్తికులవుతారు. మరి కొందరు కనపడని దైవాన్ని గుడ్డిగా నమ్మి ప్రత్యక్షంగా కనబడే దైవ ప్రతిరూపాలే అయిన మనుషులను దూషిస్తారు, ద్వేషిస్తారు. దైవానికి ఉన్న రెండు వైపులను చూసినవారు పరా ప్రకృతిని, అపరా ప్రకృతిని ప్రేమిస్తారు, పూజిస్తారు. దేన్నీ నిరాకరించరు. వారే నిజమైన ఆధ్యాత్మికత్వం కలవారు, స్వచ్ఛమైన ఆస్తికులు.


– రాచమడుగు శ్రీనివాసులు అసలైన ఆస్తికులు 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)