Breaking News

ఐశ్వర్యారాయ్‌ టోట్‌ బ్యాగ్‌ ధర తెలిస్తే నోరెళ్లబెడతారు!

Published on Thu, 05/16/2024 - 13:09

బాలీవుడ్‌​ నటి ఐశ్వరరాయ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విశ్వసుందరి ఐశ్వర్యరాయ్‌ తల్లి అయ్యాక కూడా ఆమె అదే గ్లామర్‌ని మెయింటెయిన్‌ చేస్తూ యువ హీరోయిన్లకు తీసిపోని విధంగా ఉంటుంది. ఆమె కూతురు ఆరాధ్య కూడా తల్లి అందాన్ని పుణికి పుచ్చుకున్నట్లు ఆకర్షణీయంగా ఉంటుంది. స్టైయిలిష్‌  దుస్తులతో కెమెరాకి చిక్కి అభిమానులను ఖుషీ చేస్తుంటుంది. ఇటీవల్ల ఏ వేడుకలోనైన ఈ క్యూట్‌ మామ్‌ అండ్‌ డాటర్స్‌ ఇద్దరు కలిసే సందడి చేస్తున్నారు. 

ఫ్రాన్స్‌ వేదికగా ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అట్టహాసంగా ప్రారంభమైంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలువురు సెలబ్రిటీలు ఈ ఈవెంట్​కు హాజరై సందడి చేస్తున్నారు. ఆ వేడుకలో పాల్గొనేందుకు బయలు దేరుతూ మంబై ఎయిర్‌పోర్ట్‌లో ఇలా కెమెరాకు చిక్కారు తల్లికూతుళ్ల ద్వయం. అయితే ఆమె చేతికి బ్యాండేజ్‌ వేసుకుని కనిపించడంతో ఆమెకు ఏమైందని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఇ

క కూతురు ఆరాధ్య తల్లి చేతికి గాయం అయ్యిందని ఆమె టోట్‌ బ్యాగ్‌ని తాను తీసుకుని అమ్మకు కాస్త ఉపశమనం కలిగించింది. తల్లి కూతుళ్లు ఇద్దరు మంచి స్టయిలిష్‌ డ్రెస్‌లతో స్టన్నింగ్‌ లుక్‌లో కనిపించారు. ఐశ్వర్య ఫ్యాంటుపై లూయిస్‌ విట్టన్‌ ట్రెంట్‌ కోట్‌లో అబ్బరపర్చగా, ఆరాధ్య నల్లటి ఫ్యాంటుపై తెలుపు స్పీకర్లతో కూడిన స్వెట్‌షర్ట్‌లో ఉంది. 

ఇక్కడ ఐశ్వర్య గూచీ బ్లాక్‌  లెదర్‌ టోట్‌ బ్యాగ్‌ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ ‍బ్రాండ్‌ బ్యాగ్‌ ధరలు అత్యంత ఖరీదైనవి. ఇక్కడ ఐశ్వర్యరాయ్‌ బ్యాగ్‌ టోట్‌ ధర ఏకంగా రూ. 80, 000/ పలుకుతుందట. ఈ కేన్స్‌ ఈవెంట్​లో ఎప్పుడూ స్పెషల్ అట్రాక్షన్‌గా ఐశ్వర్య రాయ్‌ నిలుస్తుంటుంది. ఆమెను భారతదేశంలోని కేన్స్‌ రాణి అని చెప్పొచ్చు. అంతేగాదు ఆమె అభిమానులు 2024 కేన్స్‌లో ఐశ్వర్యరాయ్‌ లుక్‌ ఎలా ఉంటుందా అని ఆత్రతగా ఎదురుచూస్తున్నారు.

 

(చదవండి: మిస్‌ యూఎస్‌ఏ విజేతల వరుస రాజీనామాలు! రీజన్‌ ఏంటో చెప్పిన తల్లులు)

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)