Breaking News

‘‘నా ఆధార్‌, నా ఫోటో..’’ క్యూట్‌ బేబీ ఫోజులు వైరల్‌ వీడియో

Published on Mon, 07/08/2024 - 11:24

భారత దేశంలో అపుడే పుట్టిన  శిశువు నుంచి వయో వృద్ధుల దాకా పౌరులందరికీ ఆధార్‌ కార్డు తప్పని సరిగా ఉండాలి. ఇది ఐడెంటిటీ ప్రూఫ్‌, చిరునామా గుర్తింపు పత్రం. అలాగే బ్యాంకింగ్‌ సేవలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలందించే సంక్షేమ పథకాలు పొందాలన్నా. ఇలా దేనికోసమైనా ఆధార్‌  కార్డు ఉండాల్సిందే. తాజాగా ఆధార్‌ కార్డుకు సంబంధించిన ఒక వీడియో వైరల్‌గా మారింది.

సాధారణంగా ఆధార్‌ కార్డులో  ఫోటో చూసుకొని దేవుడా.. అనుకునే వాళ్లు చాలామంది (ఇపుడు ఫోటో మార్చుకునే అవకాశం ఉందనుకోండి) ఉన్నారు.  ఇలాంటి  ఫోటోలపై చాలా  జోక్స్‌ వినే  వింటాం.  ఈ సంగతి తనకు  తెలుసులే అన్నట్టు ఆధార్ కార్డ్ ఫొటోకు ఓ చిన్నారి (గున్‌గున్‌) ఇచ్చిన ఫోజులు విశేషంగా నిలిచాయి. అసలే పింక్‌  గౌన్‌లో  చందమామలా ముద్దుగాముద్దుగా ఉంది. దీనికి తోడు ఎవరో చెప్పినట్టు రకాల రకాలుగా  క్యూట్‌ , క్యూట్‌గా ఫోజులిచ్చింది. <

 బుగ్గలపై చేయి పట్టుకుని ఒకసారి, అమాయకంగా చూస్తూ ఒకసారి, చిలిపిగా, అందంగా మల్లెపువ్వులా నవ్వుతూ కనిపించింది. అచ్చంగా పార్లే జీ పాపాలాగా కనిపించింది.  దీంతో ఈ చిట్టి తల్లి వాళ్ల అమ్మ వీడియో తీసి  గున్‌గున్‌ అండ్‌ మామ్‌అనే  ఇన్‌స్టా ఐడీలో పోస్ట్ చేసింది.  అంతే ఇది వైరల్‌ అయిపోయింది.

‘పార్లే జీ గర్ల్‌’ అంటూ నెటిజన్లు తెగ పొగిడేశారు. ఆధార్  ఫోటో  అందంగా కనిపించేది ఈ బేబీ ఒక్కతే  ఒక యూజర్‌ కమెంట్‌ చేయగా, ‘నేను నా రెండేళ్ల కుమార్తెను ఆధార్ కార్డ్ ఫోటో కోసం వెళ్లినపుడు నాకూ ఇదే అనుభవం" అని మరొకరు వ్యాఖ్యానించారు. ఈ వీడియో ఇన్‌స్టాలో 18.3 మిలియన్లకు పైగా వ్యూస్‌ దక్కించుకోవడం విశేషం.
 

 

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)