Breaking News

లాంగ్‌ గౌన్‌లో మెరిసిపోతున్న హీరోయిన్‌! డ్రెస్‌ ధర తక్కువే.. అయితే..

Published on Mon, 03/27/2023 - 11:48

Gouri G Kishan: ‘జాను’ సినిమాలో చిన్ననాటి జానకిగా సంప్రదాయంగా కనిపించి.. రెండో సినిమా ‘శ్రీదేవి–శోభన్‌బాబు’లో మోడర్న్‌ లుక్‌లో మెరిసి అభియనంలోనే కాదు అపియరెన్స్‌లోనూ వైవిధ్యాన్ని చాటుకుంది గౌరీ జి. కిషన్‌.  ఈ వెర్సటాలిటీని తను అనుసరించే ఫ్యాషన్‌లోనూ  చూపిస్తోంది. 

ప్రడే..
స్వచ్ఛమైన వెండి నగలకు పెట్టింది పేరు ఈ బ్రాండ్‌. మెషిన్‌ మేడ్‌ కాకుండా నైపుణ్యంగల స్వర్ణకారుల చేతుల్లో రూపుదిద్దుకున్న నగలే ఈ బ్రాండ్‌ క్రియేట్‌ చేసుకున్న వాల్యూ. ఆ క్రియేటర్‌ పేరు దీప్తి ముత్తుసామి. జ్యూలరీ డిజైనింగ్‌ మీదున్న ఆసక్తే ఆమెను ఈ రంగంలోకి దింపింది.

ఫ్యాషన్‌ ఎంట్రపెన్యూర్‌గా మార్చింది. దేశంలోనే పేరెన్నికగన్న జ్యూలరీ బ్రాండ్‌లలో ఒకటిగా ‘ప్రడే’ను నిలిపేలా చేసింది. ఈ బ్రాండ్‌ జ్యూలరీ ఇటు సంప్రదాయ వస్త్రధారణకైనా.. అటు వెస్టర్న్‌ అవుట్‌ ఫిట్స్‌కైనా నప్పేలా ఉంటుంది. ధరలూ అంతే అటు సామాన్యులూ కొనేలా ఇటు సెలెబ్రిటీల స్థాయినీ పెంచేలా ఉంటాయి. ఆన్‌లైన్‌లోనూ లభ్యం.

మాగ్జీహం..
పేరుకు తగ్గట్టుగానే ఎంతో ఆనందభరితంగా ఉంటాయి ఈ మాగ్జీహం కలెక్షన్స్‌. కాలేజీకెళ్లే యువతులే ఈ డిజైనర్‌ మెయిన్‌ టార్గెట్‌. క్యాజువల్‌ డ్రెసెస్‌కు కేరాఫ్‌గా ఉంటుంది ఈ బ్రాండ్‌. బడ్జెట్‌ ఫ్రెండ్లీ దుస్తులను అందిస్తూ చాలామంది యువతులకు ఫేవరేట్‌గా మారింది. ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ ఇచ్చి కొనుగోలు చేసుకోవచ్చు. చెన్నైలోని టీనగర్‌లో మెయిన్‌ బ్రాంచ్‌ ఉంది.

బ్రాండ్‌ వాల్యూ 
డ్రెస్‌ బ్రాండ్‌: మాగ్జీహం
ధర: రూ. 4,500

జ్యూలరీ
బ్రాండ్‌: ప్రడే
కమ్మల ధర: రూ. 3,130
నెక్‌పీస్‌ ధర: రూ. 19,030

కొన్నిసార్లు పొగడ్తలు కూడా  విమర్శల మాదిరి హాని చేస్తాయి. అందుకే, రెండింటినీ మనసుకు తీసుకోను. 
– గౌరీ జి.కిషన్‌ 
-దీపిక కొండి

చదవండి: Deepika Padukone: ఒంటి మీదే క్షణాల్లో ఆల్టరేషన్‌.. రణ్‌వీర్‌ డ్రెసెస్‌కి కూడా! ఈ చీర ధర తెలిస్తే..

Videos

మాజీ సీఎం వైఎస్ జగన్ దెబ్బకు దిగొచ్చిన సర్కార్

బెడ్ రూమ్ లోకి కింగ్ కోబ్రా ఏం చేశాడో చూడండి..

వల్లభనేని వంశీ ఆరోగ్యంపై భార్య పంకజశ్రీ కీలక వ్యాఖ్యలు

విజయవాడ రైల్వే స్టేషన్ కు బాంబు బెదిరింపు

ప్రభుత్వం మాది..మీ అంతు చూస్తా : Pawan Kalyan

లక్షా 40 వేల కోట్ల అప్పు తెచ్చి ఏం చేశారు బాబుపై బొత్స ఫైర్

మీకు చుక్కలు చూపిస్తా! Deputy CM

Ding Dong 2.0: కామిక్ షో

రగిలిపోతున్న పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీకి వార్నింగ్

భారీగా పెరుగుతున్న కరోనా, దేశంలో హైఅలర్ట్..

Photos

+5

900 ఏళ్ల నాటి కోటలో సుకుమార్‌ దంపతులు.. లండన్‌ ప్రిన్సెస్‌తో డిన్నర్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)