Breaking News

వయసు 70 ఏళ్లు..ఇప్పటికీ 40 కి.మీ సైకిల్‌పైనే..

Published on Tue, 06/03/2025 - 13:41

చిన్న వ్యాపారమే నడుపుతున్నా..రయ్‌రయ్‌మని..బైక్‌ లేదా కార్లలలోన వెళ్తుంటారు. పైగా అది స్టేటస్‌ ఆఫ్‌ సింబల్‌గా పలువురి అభిప్రాయం కూడా. అలాంటి ఈ రోజుల్లో ఓ తాతా గారు బడా వ్యాపారవేత్తగా చెలామణి అవుతున్నా..ఇప్పటికీ సాధారణ సైకిల్‌పైనే తన ఫ్యాక్టరీకి వెళ్తుంటాడు. అది కూడా ఏకంగా 30 కి.మీ పైనే తొక్కుతూ వెళ్లడం విశేషం. ఇవాళ వరల్డ్‌ సైక్లింగ్‌ డే సందర్భరంగా అంతలా ఫిట్‌నెస్‌ ప్రాముఖ్యత ఇచ్చి సైక్లిల్‌పైనే రాకపోకలు సాగిస్తున్న ఆ తాతగారు గురించి తెలుసుకుందామా..!.

అతడే 70 ఏళ్ల సురేష్ జరివాలా. ఆయన్ను సైక్లింగ్‌ లెజెండ్‌గా పేర్కొన్నవచ్చు. ఆయన రోజు ఉదయం 5.45 గంటలకు ప్రారంభమవుతుంది. స్వతహాగా వస్త్ర వ్యాపరావేత్త అయినా ఆయన ఫిట్‌నెస్‌కి వీరాభిమాని. ఆయన వ్యాపారిగా తన కెరీర్‌ని ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు సైకిల్‌పైనే రాకపోకలు సాగిస్తున్నాడు. మెరిసే కార్లు, బైక్‌లు ఆయన దరిచేరలేకపోయాయి లేదా ఆయన్ను ఆకర్షించడంలో విఫలమయ్యాయి అని చెప్పొచ్చు. 

ఎందుకంటే సూరత్‌లో ఫ్యాక్టరీ ఉన్నప్పుడూ..సైకిల్‌పైనే వెళ్లేవాడు. ఆ తర్వాత 1982లో ఫ్యాక్టరీ అంక్లేశ్వర్‌కు మారినా.. అతని తీరు మారకపోవడం విశేషం. నిజానికి సూరత్‌ని సలాబత్‌పురా నుంచి అంకలేశ్వర్‌ రావాలంటే కచ్చితంగా కారు లేదా బైక్‌ ఉంటేనే వెళ్లడం సాధ్యం. ఎందుకంటే ఈ తాతగారు సూరత్‌లోని తన ఇంటి నుంచి స్టేషన్‌కి మూడు కి.మీ సైకిల్‌పై ప్రయాణించి.. అక్కడ నుంచి రైలులో ప్రయాణించి అంకలేశ్వర్‌కు చేరుకుంటారు. 

ఆ తర్వాత అక్కడ స్టేషన్‌ నుంచి ఫ్యాక్టరీకి మరో నాలుగు కి.మీ సైకిల్‌ తొక్కాల్సి ఉంటుంది. అయినా సరే ఆయన సైక్లింగ్‌ వదిలేయలేదు. దాదాపు మూడు దశాబ్దాలుగా ఆయన ఇదే జీవన విధానాన్ని అనుసరిస్తున్నారు.  ఎప్పుడో 1990లలో రూ. 2000 పెట్లి అట్లాస్‌ కంపెనీ సైకిల్‌ కొనుకున్నారు. ఇప్పటికీ దానిపైనే ప్రయాణించడం చూస్తే..ఆ సైకిల్‌ని ఆయన ఎంతలా అపురూపంగా చూసుకుంటున్నారనేది స్పష్టంగా తెలుస్తోంది. 

ఇక ఆయనది ఉమ్మడి కుటుంబం. మొత్తం 22 మంది కుటుంబ సభ్యులు ఉంటారు. జరివాలాకు నలుగురు సోదరులు. వారిలో చిన్నవాడు ఆయనే. పెద్ద అన్న వయసు 80 ఏళ్లు. చిన్న మనవడికి మూడేళ్లు. ఆయన క్రమశిక్షణతో కూడిన ఆరోగ్యకరమైన జీవిన విధానం తమకు స్ఫూర్తి, ఆరాధ్యనీయమైనదని చెబుతున్నారు కుటుంబసభ్యులు. ఆయనలా అనుసరించడానికి ప్రయత్నిస్తున్నామని, కానీ మావల్ల సాధ్యం కావడం లేదని అంటున్నారు వారంతా. 

ఇంత బిజీ లైఫ్‌లో కూడా ఆయన రోజూ పదివేల అడుగులపైగా వాకింగ్‌​ చేస్తాడట. మారథాన్‌, రన్నింగ్‌ రేస్‌ వంటి అన్నింటిల్లోనూ పాల్గొటాడట. మరో విశేషం ఏంటంటే..మహారాష్ట్రలోని షిర్డీకి సుమారు 300 కి.మీ. సైకిల్‌పైనే వెళ్తాడట సురేష్ జరివాలా. ఆయన జీవిన విధానం పర్యావరణ హితంగానూ ఆరోగ్యప్రదంగానూ ఉంది. చెప్పాలంటే క్రమశిక్షణాయూతంగా జీవించడానికి ఉదాహరణ సురేష్ జరివాలా జీవన విధానం. కనీసం ఆయనలా అంతలా చేయలేకపోయినా..పర్యావరణానికి మేలు కలిగించేలా, ఆరోగ్యగా ఉండేలా జీవించడానికి కొద్ది ప్రయత్నమైనా చేద్దామా..!..

(చదవండి:  'డయాబెటిక్ రైస్' అంటే..? బాలీవుడ్‌ నటుడు గోవింద్‌ వైఫ్‌ సైతం..)

 

Videos

టీడీపీ నేతల వేధింపులతో YSRCP కార్యకర్త ఆత్మహత్యాయత్నం

Etala: తలపై తుపాకీ పెట్టిన నేను చెప్పింది ఇదే..!

నారాయణరెడ్డి కుటుంబాన్ని ఫోన్ లో పరామర్శించిన YS జగన్

ఆ రోజు మానవజాతి శ్వాస ఆగిపోతుందా?

పహల్గామ్ లో పాక్ ఉగ్రదాడికి కారణం అదే.. మోదీ కీలక వ్యాఖ్యలు

Arun Dhumal: తొక్కిసలాట గురించి మాకు తెలీదు!

విశాఖలో రెచ్చిపోతున్న PDS రైస్ మాఫియా

జోగులాంబ గద్వాల జిల్లా ధన్వాడలో ఉద్రిక్తత

Ambati Rambabu: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిపోయింది

చిరు, వెంకీ మల్టీస్టారర్ ఫిక్స్ ఇక బాక్సాఫీస్ బద్దలే..

Photos

+5

'మ్యాడ్' స్వాతిరెడ్డి ఫ్యామిలీతో థాయ్‌లాండ్ ట్రిప్ (ఫొటోలు)

+5

అఖిల్ పెళ్లిలో టాలీవుడ్ సెలబ్రిటీల సందడి (ఫొటోలు)

+5

పెళ్లయి రెండేళ్లు.. భార్య గురించి సుమలత కొడుకు పోస్ట్ (ఫొటోలు)

+5

ఇంజనీరింగ్‌ అద్భుతం.. అత్యంత ఎత్తైన రైల్వే చినాబ్‌ బ్రిడ్జి (ఫొటోలు)

+5

Akhil -Zainab Wedding : ఘనంగా అఖిల్‌ అక్కినేని- జైనబ్‌ వివాహం (ఫోటోలు)

+5

సడెన్‌గా ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న బిగ్‌బాస్‌బ్యూటీ శుభశ్రీ (ఫోటోలు)

+5

ఆల్‌ది బెస్ట్ టీమిండియా.. ఇంగ్లండ్‌కు ప‌య‌న‌మైన గిల్ సేన‌ (ఫోటోలు)

+5

పర్యావరణాన్ని అత్యద్భుతంగా చూపే పర్యాటక ప్రదేశాలివే..!

+5

దుబాయ్‌లో సమంత టూర్‌.. వైరల్‌ ఫోటోలకు లక్షల్లో లైకులు

+5

కేన్సర్‌పై పోరులో అన్నీ తానైన ప్రియుడితో నటి హీనాఖాన్‌ పెళ్లి సందడి (ఫొటోలు)