57 ఏళ్ల వయసులో ఉపాధ్యాయురాలిగా బాధ్యతలు..!

Published on Thu, 11/19/2026 - 16:35

ఓ మహిళకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చినట్టే వచ్చి..కళ్ల ముందే చేజారిపోయింది. అది కూడా కేవలం అధికారక పత్రం జారీలో లోపం కారణం కాస్తా..ఆమె అర్హతకే లోపం ఆపాదించి అనర్హత వేటు విధించింది. చివరికి న్యాయం కోసం కోర్టు మెట్లు ఎక్కినా ట్రయల్‌, జిల్లా కోర్టులో ఎదురుదెబ్బలు, నిరంతర ఒత్తిడి మధ్య చివరికి ధర్మాసనం తీర్ప్పుతో ఊరట లభించి ఉద్యోగం పొందినా..అసంతృప్తే మిగిలిందామెకు.ఎవ్వరైనా ఆమె సుదీర్ఘ న్యాయపోరాటం చూస్తే..కచ్చితంగా కళ్లల్లో నీళ్లు తిరగడమే కాదు సలాం అని కీర్తించకుండా ఉండరు. 

అసలేం జరిగిందంటే..పంజాబ్‌కు చెందిన జైమాల అనే మహిళ 1998లో సంస్కృతి ఉపాద్యాయురాలి పోస్టుకి ఇంటర్వ్యూకు పిలిచారు. ఆ తర్వాత 1999లో జిల్లా విద్యాధికారి ఆమె సర్టిఫికెట్లను పరిశీలించి రేవారిలోని ఒక ప్రభుత్వ పాఠశాలకు చేరమని ఆమెకు చెప్పారు. దురదృష్టం ఏంటంటే అధికారిక నియామక పత్రం ఎప్పుడూ ఆమె చెంతకు రాలేదు. చివరకు తన నియామక పత్రం కోసం అధికారులను ఆశ్రయించిన ఫలితం లేకుండా పోయింది. 

దాంతో ఆమె జూన్‌ 10, 1999లో కోర్టు మెట్లు ఎక్కి.. తన నియామకాన్ని, బకాయి జీతభత్యాలు కోరుతూ పిటిషన్‌ దాఖలు చేసిందామె. ఆ పిటిషన్‌లో తాను సంస్కృతం, ఇంగ్లీష్‌ సబ్జెక్టులుగా బీఏ, బీఎడ్‌ డిగ్రీలు చేశానని, బీఏ పార్ట్‌1, పార్ట్‌ 2లో హిందీ చదివానని పేర్కొంది. అయితే నియామకానికి ముందస్తు అవసరమైన మెట్రిక్యులేషన్ స్థాయి వరకు హిందీ పరిజ్ఞానాన్ని చూపించే ఎలాంటి సర్టిఫికెట్‌ను ఆమె సమర్పించలేదంటూ ఆమె వాదనను ఖండించింది హర్యానా ప్రభుత్వం. అలాగే ఆమె బీఏలో హిందీ చదివిందన్న వాదనను కూడా అవాస్తవమని ఆరోపణలు చేసింది.  

దాంతో మే 18, 2006న ఒక ట్రయల్ కోర్టు ఆమె దావాను కొట్టివేయగా, అక్టోబర్‌లో రేవారి జిల్లా జడ్జి ఆ నిర్ణయాన్ని సమర్థించారు. చివరకు ఆమె నవంబర్‌ 11, 2026న హైకోర్టుని ఆశ్రయించింది. దాంతో ఆమెకు కాస్తా ఊరట, న్యాయమూ లభించాయి. ధర్మాసనం రెండు కోర్టుల తీర్పులను పక్కన పెట్టి..జూన్‌ 10, 1999 నుంచి సంస్కృత ఉపాద్యాయురాలిగా నియమించాలని, అలాగే తత్సంబంధిత ప్రయోజనాలను కూడా ఆమెకు అందించాలని హర్యానా ప్రభుత్వాన్ని ఆదేశించింది. 

అంతేగాదు ఆమెకు ఏ సబ్జెక్టులో అయితే పరిజ్ఞానం అవసరమో, అదే సబ్జెక్టులో ఉన్నత విద్యా అర్హతను పొందిన తర్వాత, కేవలం ఆమె మెట్రిక్యులేషన్ స్థాయిలో హిందీ చదవలేదన్న ఒక్క కారణం చూపి అనర్హురాలిగా చేయకూడదని ప్రభుత్వానికి చివాట్లు పెట్టి.. ఉపాధ్యాయురాలిగా నియామకం ఖరారు చేయమని హర్యానా ప్రభుత్వాన్ని ఆదేశించింది ధర్మాసనం. 

సర్వీస్‌​ ఐదు నెలలు ఉందనగా న్యాయం..
పాపం జైమాల ఈ సుదీర్ఘ న్యాయపోరాటంలో తన శారీర ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిందని వాపోయింది. బాధకరం ఏంటంటే ఆమె రిటైర్మెంట్‌కి ఇంకో ఐదు నెలలు ఉందనగా న్యాయం జరగడం. ప్రస్తుతం ఆమెకు 57 ఏళ్లు. ఏదీఏమైనప్పటికీ న్యాయం లభించింది..తక్కువ సర్వీసే అయినా కనీసం కొన్నాళ్లైనా పాఠాలు బోధిస్తాను అదే చాలు అని ఆత్మవిశ్వాసంగా అన్నారు జైమాల. కాగా,  ఈ పోరాటంలో అన్ని విధాలుగా అండగా నిలిచి లక్షలు ఖర్చుపెట్టిన తన భర్త రూప్‌చంద్‌కు, తనకు న్యాయం చేసిన ధర్మాసనానికి ధన్యవాదాలు తెలియజేసింది. 
 

Videos

భారీగా పెరిగిన బిర్యానీ ధరలు.. ఎంత పెరిగిందంటే? కారణం ఇదే!

నంద్యాలలో MPP సీట్లు గెలుచుకున్న వైఎస్సార్‌సీపీ

ఆ ఇద్దరూ కలసి కోట్లు కొట్టేయడానికి స్కెచ్ వేశారు..? కట్ చేస్తే..!

IMD హెచ్చరిక.. ఆ మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్

మునగపాక ఎంపీపీ పదవి YSRCP కైవసం

కొట్టేది ఆయనే.. ఏడ్చేది ఆయనే.. కోయ ప్రవీణ్ పై అవినాష్ రెడ్డి సెటైర్లు

శిల్పా చక్రపాణి రెడ్డి అరెస్ట్

Viral: మిసిసిపి నదిలో భారీ ప్రమాదం.. బోల్తా పడిన పర్యాటక నౌక..

ఒక్కడే వచ్చి మూడు షాపులు లూటీ! CCTVలో షాకింగ్ దృశ్యాలు

YSRCP గెలుపు జీర్ణించుకోలేక టీడీపీ నేతల దౌర్జన్యం

Photos

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో ఘనంగా మహిళా దినోత్సవం..ముఖ్య అతిథిగా నటి రష్మిక (ఫోటోలు)

+5

స్టేజీ షో.. అభినయంతో అదరగొట్టేసిన సంయుక్త (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో కన్నడ హీరోయిన్లు (ఫొటోలు)

+5

‍అనిరుధ్-కావ్య పెళ్లిలో ఫుల్ హంగామా (ఫొటోలు)

+5

'ఆకాశంలో ఒక తార'.. అందంగా సాత్విక (ఫొటోలు)

+5

కూతురితో శ్రియ క్యూట్ జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

బ్లాక్ డ్రెస్‌లో అదరగొడుతున్న అనిషా అంబ్రోస్..(ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ చిలుకలా మీనాక్షి చౌదరి (ఫొటోలు)

+5

కొల్లేరులో శీతాకాలంలో విడిది పక్షుల సందడి (ఫోటోలు)

+5

అనంతపురం : పులకించిన పుట్టపర్తి (ఫోటోలు)