Breaking News

ఓ వ్యక్తి గొంతులో అసాధారణ పరిస్థితి..కంగుతిన్న వైద్యులు

Published on Fri, 06/28/2024 - 11:29

పలువురు వింతగొలిపే సమస్యలతో బాధపడుతుంటారు. ఒక్కోసారి అవి వైద్య పరిజ్ఞానానికే అందని విధంగా ఉంటాయి కూడా. అలాంటి వింతైన సమస్యతో బాధపడుతున్నాడు 52 ఏళ్ల వ్యక్తి. అయితే అనుహ్యంగా ఓ దురలవాటుకి దూరంగా ఉండటంతో అతని సమస్యను పరిష్కరించడాని వైద్యులకు మార్గం సుగమమయ్యింది. ఇంతకీ అతను ఎలాంటి అరుదైన పరిస్థితిని ఎదుర్కొన్నాడంటే..

52 ఏళ్ల ఆస్ట్రియన్‌ అనే వ్యక్తి చాలా అరుదైన పరిస్థితిని ఎదుర్కొన్నాడు. అతను కొన్ని రోజులుగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఎడతెరగని దగ్గు, తదితర సమస్యలతో బాధపడుతూ ఆస్ప్రతిలో చేరాడు. అక్కడ వైద్యులు బ్రోంక్‌స్కోప్‌తో జరిపిన వైద్య పరీక్షల్లో..ఆ వ్యక్తి గొంతులోని పరిస్థితిని చూసి విస్తుపోయారు. ఊహించని రీతిలో అక్కడ జుట్టు పెరగడం చూసి గందరగోళానికి గురయ్యారు. నిజానికి ఆ వ్యక్తికి పదేళ్ల వయసులో ట్రాకియోటోమీ చేయించుకున్నాడు. ట్రాకియోటోమీ అంటే.. మెడ వెలుపలి నుంచి శ్వాసనాళంలోకి (విండ్‌పైప్) ఓపెనింగ్ సృష్టించడం ద్వారా ఊపిరితిత్తులకు గాలి, ఆక్సిజన్ చేరుకోవడంలో సహాయపడే ప్రక్రియ.

ట్రాకియోటోమీ ఉన్న వ్యక్తి ఓపెనింగ్‌లో చొప్పించిన ట్రాకియోటోమీ ట్యూబ్ ద్వారా శ్వాస తీసుకుంటాడు. దీని కారణంగా అతని శ్వాసనాళంలో ఓపెనింగ్‌ ఉంటుంది. అక్కడ అతని చెవి నుంచి తీసిన చర్మం, మృదులాస్థితో అంటుకట్టుట పద్ధతిలో ఆ ఓపెనింగ్‌ని స్థిరీకరించేలా చేశారు వైద్యులు. సరిగ్గా ఆ ప్రాంతంలో అసాధారణ రీతిలో వెంట్రుకలు పెరగడం మొదలయ్యింది. 

అవి ఏకంగా ఆరు నుంచి తొమ్మిది వరకు.. సుమారు రెండు అండుళాల మేరు పొడవుగా ఉన్నాయి. అందువల్ల అతని గొంతు బొంగరుపోయి, దగ్గు వంటి సమస్యలు తలెత్తినట్లు గు​ర్తించారు. ఈ నేపథ్యంలో వైద్యులు ఆ వెంట్రుకలను తొలగంచే ప్రక్రియ చేపట్టారు. ఇలా సదురు వ్యక్తి 14 ఏళ్ల పాటు ఆస్పత్రిని సందర్శించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

ఇక అతడే తనకున్న ధూమపానం దురలవాటుకి దూరంగ ఉంటూ ఉండటంతో అనూహ్యంగా వాటి పెరుగుదల తగ్గింది. వైద్యులు కూడా అతడిలో వచ్చిన సానుకూల మార్పుకి అనుగుణంగా ఎండోస్కోపిక్ ఆర్గాన్ ప్లాస్మా కోగ్యులేషన్ అనే కొత్త విధానానంతో జుట్టు పెరుగుదల శాశ్వతంగా  చెక్కుపెట్టారు. ఇక్కడ ఈ వ్యక్తిని చూస్తుంటే.. మనకున్న దురలవాట్లే మనలను అనారోగ్యం పాలు జేస్తుందనడానికి ఈ ఘటనే ఉదాహరణ . 

(చదవండి: ఇలాంటి జిమ్‌ సెంటర్లకి వెళ్లకపోవడమే మేలు...!)
 

#

Tags : 1

Videos

ఎవరివైపు పబ్లిక్? చాణక్య సర్వేలో క్లారిటీ!

ధనుష్ పార్టీకిలోకి TVK మంత్రి..?

DSC స్కామ్ బట్టబయలు లోకేష్ కి ఇచ్చిపడేసిన వరుదు కళ్యాణి

మళ్లీ భారీగా పెరిగిన బంగారం ఎంత పెరిగిందంటే..!

కొండా రాజీనామా! కొండా సురేఖ సంచలన నిర్ణయం

ఏ క్యారెట్ బంగారం కొంటే లాభం? పెరుగుతున్న బంగారం ధరలు

ఖర్చుకు భయపడి హైదరాబాద్ లో స్పిరిట్ షూటింగ్.. ఎక్కడంటే..?

ప్రారంభం రోజే పగుళ్లు.. పోలవరంపై పెను ప్రశ్నలు?

ఒక్క Rolex Watch తయారీకి ఎంత సమయం పడుతుంది?

అప్పుల్లో ఆల్ టైమ్ రికార్డును బద్దలు కొట్టేసిన బాబు

Photos

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)