Breaking News

ఆరోజు నాకు ఎవరూ జాబ్‌ ఇవ్వలేదు, కానీ ఇప్పుడు నేనే ఉపాధి కల్పిస్తున్నా

Published on Tue, 11/28/2023 - 13:15

ఒకప్పుడు ఆయనకు ఉద్యోగం ఇవ్వడానికి ఎవరూ ముందుకు రాలేదు. కానీ ఈరోజు ఆయనే ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్నాడు. వైకల్యం శరీరానికే తప్ప కష్టపడే తత్వానికి కాదని నిరూపిస్తున్నారు 31 ఏళ్ల ప్రముఖ వ్యాపారవేత్త సుమిత్‌ అగర్వాల్‌. తాజాగా హైదరాబాద్‌లో ఫార్చ్యూన్ అకాడమీ నిర్వహించిన లెగసీ బిల్డింగ్ లైవ్ ప్రోగ్రామ్‌కు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచి ఎన్నో అవమానాలు, ఎదురుదెబ్బలు ఎదుర్కొన్నాను. పుట్టినప్పటి నుంచే నాకు సెరిబ్రల్‌ పాల్సీ అనే వ్యాధి ఉంది.

ఓ జ్యోతిష్యుడు నేను 33 ఏళ్లకు మించి బతకనని మా తల్లిదండ్రులకు చెప్పాడు. విచిత్రం ఏంటంటే.. అతను ఇప్పుడు బతికి లేడు. కానీ నేను మీ ముందు ఉన్నాను. వైకల్యంతో ఏం సాధిస్తావ్‌ అన్నవాళ్లకు దేశంలోనే MBAలో అగ్రస్థానంలో నిలిచి సమాధానం ఇచ్చాను. చాలామంది నువ్వు ఏం చేస్తావ్‌, ఏమీ చేయలేవు అని విమర్శిస్తారు. కానీ వాళ్లకు ఒకటి చెప్పాలనుకుంటున్నా.. నేను చేసి చూపిస్తాను. మీకు వీలైతే నన్ను ఆపండి. ఒకప్పుడు నా వైకల్యం వల్ల నాతో ఆడుకోవడానికి కూడా ఎవరూ వచ్చే వాళ్లు కాదు. దీంతో నా జీవితంలో నాకు ఫ్రెండ్స్‌ లేకుండా పోయారు. విద్యార్హత ఉన్నా జాబ్‌ ఇచ్చేవాళ్లు కాదు, కానీ ఇప్పుడు నేనే సొంతంగా వ్యాపారం ప్రారంభించి ఎంతోమందికి ఉద్యోగాలు ఇస్తున్నాను.

సుమారు 500 మంది వికలాంగులకు ఉద్యోగం వచ్చేలా సహాయం చేశాను. గట్టిగా తలుచుకుంటే ఏదైనా సాధ్యమవుతుంది. మిమ్మల్ని మీరు నమ్మండి. సక్సెస్‌ అదే వస్తుంది. నాకు ఇప్పటివరకు  నాలుగు శస్త్రచికిత్సలు జరిగాయి. దాదాపు  70% ఎలాంటి కదలికలు ఉండవు. ఇప్పటికి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నా. అయినా అధైర్యపడకుండా అడుగు ముందుకు వేస్తున్నా.సరైన పేరెంటింగ్ నా జీవితాన్ని కాపాడింది అంటూ ఆయన పేర్కొన్నారు. కాగా బిజినెస్‌లో మెలకులు నేర్పించి మంచి ఆదాయ మార్గాలను అందించే లక్ష్యంగా ఫార్చ్యూన్ అకాడమీ ఏర్పాటైన సంగతి తెలిసిందే. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)