Breaking News

ఇలాంటి జిమ్‌ సెంటర్లకి వెళ్లకపోవడమే మేలు...!

Published on Tue, 06/25/2024 - 15:06

ఇటీవల ఫిట్‌నెస్‌ మీద దృష్టిసారిస్తోంది యువత. అందుకోసమని యోగా, ఏరోబిక్‌, జిమ్‌ వంటి పలు రకాల సెంటర్‌లకి వెళ్లి మరీ వర్కౌట్లు చేస్తున్నారు. అయితే చాలామంది చేసే తప్పు ఏంటంటే.. ఆ జిమ్‌ సెంటర్‌ ఫేమస్‌? కాదా అన్నది చూస్తారు గానీ ఆ సెంటర్‌లో సౌకర్యాలు ఎలా ఉన్నాయనేది గమనించారు. పాపం అలానే ఇక్కడొక మహిళ జిమ్‌ సెంటర్‌ పరిస్థితిని గమనించకపోవడంతో ప్రాణాలు పోగొట్టుకుంది. ఈ దిగ్బ్రాంతికర ఘటన ఇండోనేషియాలో చోటు చేసుకుంది.

వివరాల్లోకెళ్తే..ఇండోనేషియాలోని జిమ్‌లో 22 ఏళ్ల మహిళ మూడో అంతస్తులో ఉన్న ట్రెడ్‌మిల్‌పై నుంచి జారిపడి.. నేరుగా కిటికిలోంచి కిందపడి దుర్మరణం చెందింది. ఈ ప్రమాదం ఇండోనేషియాలోని కాలిమంటన్‌లోని పోంటియానాక్‌లో జూన్‌ 18న చోటు చేసుకుంది. ఆ మహిళ ట్రెడ్‌మీల్‌పై నడుస్తూ ఉండగా అనూహ్యంగా బ్యాలెన్స్‌ కోల్పోయింది. అయితే వెనుక ఎంతో మేర ప్రదేశం లేకపోవడం ..దీనికి తగ్గట్టు అక్కడ ఉన్న గోడ మాదిరి అద్దంలాంటి విండో తెరిచి ఉండటంతో వెంటనే నేరుగా పడిపోయింది. దీంతో ఆమె తలకు తీవ్ర గాయాలై అయక్కడికక్కడే మృతి చెందింది. 

ఈ ప్రమాదం ఆమె తన ప్రియుడితో కలిసి జిమ్‌ చేసేందుకు వచ్చినప్పుడూ చోటుచేసుకున్నట్లు స్థానిక మీడియ పేర్కొంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా..ట్రెడ్‌మిల్‌కి కిటికి మధ్య దూరం కేవలం 60 సెంటిమీటర్ల దూరం ఉన్నట్లు తేలింది. పోస్ట్‌మార్టం రిపోర్టు కూడా తలకు తీవ్ర గాయలవ్వడంతోనే మృతి చెందిదని పేర్కొంది. నిజానికి ట్రెడ్‌మిల్‌పై ఎవరైనా కిందపడిపోవటం కామన్‌ అని, అయితే తగురీతిలో అక్కడ భద్రత లేకపోవడమే బాధకరమని అన్నారు ఇండోనేషియా పోలీసులు.

అలాగే సదరు జిమ్‌ యజామనిని ఇలా ఎందుకు ఏర్పాట్లు చేశారని ప్రశ్నించగా..అద్దానికి వ్యతిరేకంగా చేస్తే దృష్టి మరలదని ఇలా ఏర్పాటు చేసినట్లు తెలిపాడు. అలాగే విండోలు క్లోజ్‌ చేసేలా వ్యక్తిగత పర్యవేక్షకులు పరివేక్షిస్తుంటారని చెప్పుకొచ్చాడు. అయితే ఈ ప్రమాదం జరిగినప్పుడూ ఒకరూ లీవ్‌లో ఉండటంతోనే ఇది జరిగిందని చెప్పాడు సదరు యజమాని. ప్రస్తుతం పొలీసులు సదరు జిమ్‌ నిర్వహణ అనుమతిపై కూడా విచారణ చేపడుతున్నారు.

(చదవండి: పారిస్‌ ఫ్యాషన్‌ వీక్‌లో జాన్వీ స్టైలిష్‌ లుక్‌..గజగామిని మాదిరి..!)

 

#

Tags : 1

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)