Breaking News

జస్ట్‌ ఆరు రోజుల్లో ఇంగ్లీష్‌, అలవోకగా 46 భాషలు..ఏకంగా 400..

Published on Tue, 06/24/2025 - 13:58

బహు భాషల్లో అలవోకగా మాట్లాడే వారిని చాలామందిని చూశాం. మహా అయితే ఓ 20 లేదా 30 భాషలు వచ్చిన వాళ్లను చూసి.. నోరెళ్లబెట్టేస్తాం. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే అబ్బాయికి ఎన్ని భాషలు వచ్చో తెలిస్తే విస్తుపోతారు. మాట్లాడటమే కాదు ఆ భాషల్లో రాయడం, టైప్‌ చేయడం కూడా సునాయాసంగా చేసేస్తాడట. అంత టాలెంటెడ్‌ యువకుడు ఎవరంటే..

ఆ యువకుడు మన భారతదేశంలోని చెన్నైకి చెందినవాడే. ఆ యంగ్‌ టాలెంట్‌ పేరు మహమూద్ అక్రమ్. బహుభాషావేత్త  తండ్రి పెంపకంలో పెరిగిన అక్రమ్‌ బాల్యం అంతా అక్షరాలు, లిపిలు, మాండలికాలను అలవోకగా పలికించడం మధ్య పెరిగాడు. అతని తండ్రి షిల్బీ మోజిప్రియాన్ 16 భాషలు  మాట్లాడగా..అందులో అతడినే మించిపోయాడు అక్రమ్‌. 

నాలుగేళ్లకే తమిళం, ఆంగ్లం నేర్చకున్న అక్రమ్‌ కేవలం ఆరు రోజుల్లో ఆంగ్లంపై పట్టు సాధించి అందరిని ఆశ్చర్యపరిచాడు. ఆరేళ్ల ప్రాయానికే  వట్టేలుట్టు, గ్రంథ ప్రారంభించాడు, అలాగే పురాత తమిళ లింపిలో తండ్రినే అధిగమించాడు.ఇ క ఎనిమిదేళ్లకు ఆన్‌లైన్‌ ఫ్లాట్‌ఫామ్‌లలో సుమారు 50 భాషలను నేర్చుకున్నాడు. ఏ భాషనైనా సులభంగా నేర్చుకోగల అక్రమ్‌ మేథస్సుని అంతా సూపర్‌ కంప్యూటర్‌తో పోల్చడం విశేషం. 

అంతేగాదు అతి పిన్న వయస్కుడైన ద్విభాషా టైపిస్ట్‌గా ప్రపంచ రికార్డుని సైతం గెలుచుకున్నాడు. అలాగే మన జాతీయ గీతాన్ని జస్ట్‌ ఒక్క గంటలో సుమారు 20 భాషల్లో టైప్‌ చేసి రికార్డు సృష్టించడమే గాక ప్రతిష్టాత్మక జర్మన్ యంగ్ టాలెంట్ అవార్డును కూడా గెలుచుకున్నాడు. అలా అతడి ప్రతిభ అంతర్జాతీయ వేదికలకు చేరుకుంది. 

అంతేగాదు ఓ టాలెంట్‌ షోలో గెలిచి..ఆస్ట్రియాలోని వియన్నాలోని డానుబే ఇంటర్నేషనల్ స్కూల్‌లో చదువుకునేలా స్కాలర్‌షిప్‌ని కూడా పొందాడు. అలా అక్రమ్‌ 19 ఏళ్లకే దాదాపు 46 భాషల్లో అనర్గళంగా మాట్లాడటం తోపాటు సుమారు 400 భాషల్లో రాయడం, టైప్‌ చేయగల సామర్థ్యం సంపాదించాడు.

అయితే ఇంతలా డజన్ల కొద్దీ భాషల్లో ప్రావీణ్యం ఉన్నా..అతడుకు అత్యంత ఇష్టమైన భాష మాత్రం మాతృభాష తమిళం అంటేనే మహాప్రీతి అని చెబుతున్నాడు. అదే తన హృదయానికి దగ్గరగా ఉంటుందని, పైగా తన తమిళ వారసత్వం, సంస్కృతిని చాటిచెప్పేలా ఈ బహు బాషా ప్రావిణ్యం ఉపకరిస్తోందని చెబుతున్నాడు అక్రమ్‌.

(చదవండి: 52 ఏళ్లుగా కడుపులోనే టూత్‌ బ్రెష్‌..!ఐతే సడెన్‌గా..)

 

Videos

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)