Breaking News

ఒకసారి.. పదహారో శతాబ్దంలోకి వెళ్లివద్దామా?!

Published on Thu, 06/06/2024 - 08:41

రాజాంతఃపురాలను, కోటలను సినిమాలలో తప్ప స్వయంగా చూడటం సాధ్యం కాదేమో అని బెంగపడే వాళ్లకు ఆహ్వానం పలుకుతోందీ ప్యాలెస్‌. ఇది మహారాష్ట్రలోని సావంత్‌వాడిప్యాలెస్‌. గోవాకు దగ్గరలో ఉంది. పదహారవ శతాబ్దంలో నిర్మించిన ఈప్యాలెస్‌లోకి అతిథులకు ఆత్మీయ స్వాగతం పలుకుతున్నారు సావంత్‌ రాజవంశీకులు.

యువరాజు లఖమ్‌ సావంత్‌ భోంస్లే, యువరాణి శ్రద్ధా సావంత్‌ భోంస్లేలు తమప్యాలెస్‌ను పర్యాటకులకు హోమ్‌స్టేగా మార్చారు. ‘‘మేము మాప్యాలెస్‌తో వ్యాపారం చేయడం లేదు, మనదేశ చరిత్రను తెలియచేస్తున్నాం. స్వాతంత్య్రోద్యమ సమయంలో గాంధీజీ ఆధ్వర్యంలో ఉప్పు సత్యాగ్రహం ఇక్కడ జరిగింది.

మరో సందర్భంలో నెహ్రూ కూడా బస చేశారు. ఈప్యాలెస్‌లో అడుగుపెట్టిన క్షణం నుంచి మా కొంకణ సంప్రదాయ ఆహ్వానం, ఆత్మీయతలు, భోజనంతో పదహారవ శతాబ్దంలోకి వెళ్లి΄ోతారు’’ అని చెబుతున్నారు ఈ ఇంటి వాళ్లు.

టైమ్‌ మెషీన్‌లో కాలంలో వెనక్కి వెళ్లడం సినిమాల్లో చూడడం కాదు ఇక్కడ స్వయంగా అనుభూతి చెందవచ్చు, అంతేకాదు... మొఘలులు పర్షియా నుంచి మన దేశానికి తీసుకువచ్చిన గంజిఫా ఆట ఆడడం వంటివి ఇక్కడివి వచ్చిన వాళ్లకు నేర్పిస్తామని చెబుతున్నారు.

రాజసాన్ని చూపిస్తుంది. కళాత్మక లాలిత్యంతో కనువిందు చేస్తుంది. అమ్మ ఒడిలా ఆప్యాయతనిస్తుంది. అమ్మమ్మ చేతి స్పర్శలోని మృదుత్వాన్ని గుర్తు చేస్తుంది. పర్యటన రొటీన్‌కి భిన్నంగా ఉండాలని కోరుకునే వాళ్లకు చక్కటి వెకేషన్‌ అవుతుంది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)