Breaking News

శభాష్‌ మహిరమ..! జస్ట్‌ 13 ఏళ్లకే రికార్డు సృష్టించింది

Published on Fri, 06/06/2025 - 07:56

అక్షరమై మెరిసి...డిజిటల్‌ యుగంలో చిన్నారులు పుస్తకాల కంటే సెల్‌ఫోన్‌తోనే కాలక్షేపానికి సమయం కేటాయిస్తున్నారు. కానీ మహిరమ అందుకు విరుద్ధం. సాహిత్యాన్ని అభిరుచిగా మార్చుకుంది. పదమూడు సంవత్సరాల వయసులోనే నవల రాసి శభాష్‌ అనిపించుకుంది మహిరమ...

తొమ్మిది సంవత్సరాల వయసులోనే చిన్న చిన్న పద్యాలు, పాటలు రాయడం ప్రారంభించింది మహిరమ.  పదో ఏట స్నేహితులతో కలిసి చిన్న కథ రాసింది. ఆ తరువాత దీనినే నవలగా రాయాలనుకుంది. నవలగా పూర్తిరూపంలోకి రావడానికి రెండేళ్లు పట్టింది. 500 పేజీల ఈ నవల పేరు...రూబీ బ్లూ స్ట్రీమ్‌ అండ్‌ ద బాండ్‌ ఆఫ్‌ ఫైర్‌.

సంగీతంలోనూ మహీరమ రాణిస్తోంది. ప్రస్తుతం కర్ణాటక సంగీతంలో ఫోర్త్‌ గ్రేడ్‌లో శిక్షణ తీసుకుంటోంది. హస్తకళలు, చిత్రలేఖనం, ఫొటోగ్రఫీ, గ్రాఫిక్‌ డిజైన్‌లోనూ విశేష ప్రతిభ కనబరుస్తోంది. ఫ్రెంచి కూడా నేర్చుకుంటోంది. హైదరాబాద్‌లో 9వ తరగతి చదువుతున్న చల్లా మహిరమ ‘రూబీ బ్లూస్ట్రీమ్‌ అండ్‌ ద స్కీమ్‌ ఆఫ్‌ టైమ్‌’ పేరుతో మరో పుస్తకానికి శ్రీకారం చుట్టింది.

అందరూ చదివేలా...
నేను రాసిన ఫాంటసీ నవల ‘రూబీ బ్లూ స్ట్రీమ్‌ అండ్‌ ద బాండ్‌ ఆఫ్‌ ఫైర్‌’  పిల్లలే కాదు అన్ని వయసుల వారూ చదివేలా రాశాను. ఫాంటసీ సబ్జెక్ట్‌పై ఆసక్తి ఉన్నవారికి బాగా నచ్చుతుందని ఆశిస్తున్నాను. ప్రకృతితో ముడిపడి ఉన్న అంశాల ఆధారంగా నవల రాశాను. భూమి, నీరు, గాలి, అగ్ని...వీటితో మనిషి జీవితం ఎలా ముడిపడి ఉంటుందనే విషయం చుట్టూ నవల సాగుతుంది. 
– చల్లా మహిరమ 

(చదవండి: అత్యంత వృద్ధ డాక్టర్‌గా రికార్డు..! ఇప్పటికీ వైద్య సేవలోనే..! ఏజ్‌లో సెంచరీ కొట్టాలంటే..)

#

Tags : 1

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)