Breaking News

ఒక్క వీడియోతో ఓవర్‌ నైట్‌ స్టార్‌గా 11 ఏళ్ల చిన్నారి..!

Published on Thu, 01/30/2025 - 12:47

చిన్నపిల్లలు వయసుకు మించి అసాధారణ ప్రతిభను ప్రదర్శిస్తే ఏ తల్లిదండ్రులైన గర్వంగా ఫీలవ్వుతారు. అలాంటి ప్రతిభతోనే అందర్ని ఆకర్షించి ఆశ్చర్యపరుస్తోంది ది బిలియనీర్స్ డాటర్' మూ అబ్రహం. జస్ట్‌ 11 ఏళ్లకే ఒక్క వీడియోతో ఓవర్‌నైట్‌ స్టార్‌గా మారిపోయింది. తల్లిదండ్రుల వ్యాపారంలో చేదుడువాదుగా ఉండి లాభాల బాట పట్టిస్తోంది.

లవ్ లగ్జరీ స్టోర్(Love Luxury store) వ్యవస్థాపకులు ఆడమ్(Adam), ఎమిలీ అబ్రహం(Emily Abraham) దంపతులు కుమార్తె మూ అబ్రహం(Moo Abraham). సోషల్‌ మీడియోలో కొన్ని వీడియోలు కట్టిపడేస్తుంటాయి. అలాంటి ఓ వీడియోతో ఒక్కసారిగా ఓవర్‌నైట్‌ స్టార్‌గా మారింది మూ అబ్రహం అనే పదకొండేళ్ల చిన్నారి. వాళ్లకు ఉన్న లగ్జరీ స్టోర్‌లోని అత్యంత ఖరీదైన బ్రాండెడ్‌ హెర్మ్స్ బ్యాగులు, రోలెక్స్ , పాటెక్ ఫిలిప్ వాచీలు వంటి యాక్సెసరీల ధరల, వాటి నాణ్యత గురించి అలవొకగా చెప్పే ఓ వీడియోని ది బిలియనీర్స్‌ డాటర్‌(The Billionaire's Daughter) పేరుతో సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు ఆమె తల్లి ఎమిలీ. 

ఆ వీడియోకి విశేష స్పందన వచ్చి.. మిలియన్ల కొద్ది వ్యూస్‌ వచ్చాయి. నిజానికి తమ బిజినెస్‌ ఊపందుకునేలా సోషల్‌ మీడియాలో ప్రచారం చేయాలనుకున్నారు ఆ దంపతులు. అందులో భాగంగా ఆ దంపతులు తమ కుమార్తెతో సరదాగా తమ బ్రాండ్‌ల వివరాలను చెప్పిస్తూ వీడియో చేశారు. ఆ ఒక్క వీడియో ఆమెను ఏ రేంజ్‌ స్టార్‌గా మార్చిందంటే..ఏకంగా సోషల్‌ మీడియా మేనేజర్‌ వచ్చి ఆ చిన్నారి చేత వీడియో చేయించుకునే స్థాయికి ఇమేజ్‌ పెరిగింది. నిజానికి అంతకు మందు ఆ దంపతులు తమ వ్యాపారానికి సంబంధించిన వీడియోలు ఎన్నో సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేవారు. 

కానీ అవేమి వీక్షకులను ఆకర్షించలేకపోయాయి. కానీ మూ చెప్పే విధానం.. మార్కెటింగ్‌ స్ట్రాటజీ పట్టినట్టుగా ప్రతి యాక్సెసరీల ధరను అలవోకగా చెప్పేస్తుంది. ఏది మన్నికగా ఉంటుంది. మనకున్న బడ్జెట్‌కి అనుగుణంగా ఏది ఎంచుకుంటే మంచిది అనేవి అద్భుతంగా చెబుతుంది. ఫ్యాషన్‌కి సంబంధించిన వీడియోలో ఈ చిన్నారి వీడియోలకే విశేష ఆదరణ ఉంది. 

ఈ చిన్నారి కేవలం హైఎండ్‌ బ్రాండ్‌ల వీడియోలనే కాదు తనకంటూ సొంతంగా సోషల్‌ మీడియా ఖాతాను మెయింటైన్‌ చేస్తుంది. దాన్ని ఆమె తల్లిందండ్రులు హ్యాండిల్‌ చేస్తారు. అందులో కూడా ఏ ధరకు ఎలాంటి బ్రాండెడ్‌ ప్రొడక్ట్‌ దొరకుతుందనే అవగాహనను కూడా కల్పిస్తోంది. ధరకు తగ్గ లగ్జరీ ప్రొడక్ట్‌ ఎలా ఐడింటిఫై చేయాలో కూడా టక్కున చెప్పేస్తుంది ఈ చిన్నారి మూ. 

నిజానికి పెద్ద సేల్స్‌ మేనేజర్ల కూడా ఒక ప్రొడక్ట్‌ని అమ్మేందుకు, దాని వివరాలు చెప్పేందుకు ఎంతో ప్రయాసపడుతుంటారు. అదేం పెద్ద కష్టం కాదంటూ ఇంత చిన్న వయసులో అలవొకగా చెప్పేస్తున్న మూ అబ్రహంని చూస్తుంటే అబ్బురపడకుండా ఉండలేం కదూ..!.

 

(చదవండి: చుట్టుముట్టిన ఆరోగ్య సమస్యలు..దెబ్బకు 60 కిలోలు తగ్గింది..!)
 

#

Tags : 1

Videos

AP: దారుణంగా పెరిగిపోతున్న హత్యలు నెల్లూరులో ఏం జరిగిందంటే..

సంచలనం రేపుతున్న డ్యాన్సర్స్ యూనియన్ వివాదం

అంబానీపై SBI కేసు.. అసలు కారణం ఇదే!

నేను తప్పు చేయలేదు కన్నీరు పెట్టుకున్న కవిత.. ఎందుకంటే..!

కోడిగుడ్లు, టమాటాలతో కోమటిరెడ్డి కార్యాలయంపై దాడి

Nepal Flood: చావు అంచున ప్రాణాలు కాపాడిన అసలైన హీరో!

నీ చరిత్ర మొత్తం బయట పెడితే.. మొహం ఎక్కడ పెట్టుకుంటావో తెలుసా..

బాబుకు ఏపీ కంటే తెలంగాణ అంటేనే ప్రేమ ఎక్కువ..!

ద్రౌపది ముర్ము ADC 'నేషనల్ క్రష్' రిషబ్ సింగ్ రాజీనామా

ఏపీలో మందు బాబులకు బిగ్ షాక్

Photos

+5

రోమాంచకం హీరోయిన్ అనంతిక గ్లామరస్ లుక్స్.. ఫోటోలు

+5

అమెరికా ట్రిప్‌లో బుట్టబొమ్మ పూజా హెగ్డే చిల్.. ఫోటోలు

+5

'ఇరుముడి'లో చీరతో.. ఇప్పుడేమో స్టైలిష్‌గా (ఫొటోలు)

+5

పెళ్లి పీటలెక్కనున్న కొత్త జంట (ఫొటోలు)

+5

చెల్లితో కలిసి ప్రకృతి ఒడిలో 'ప్రేమమ్' హీరోయిన్ (ఫొటోలు)

+5

ఈ టాలీవుడ్ హీరోయిన్ గుర్తుందా? బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

ట్రెండింగ్‌లో 'రద్ధిమా' సాంగ్.. సాయి-భాగ్యశ్రీ కెమిస్ట్రీ (ఫొటోలు)

+5

వెలిగొండకు జగన్‌ అప్పుడే.. క్రెడిట్‌ ఎవరిదో ఈ ఫొటోలు చూస్తే క్లారిటీ!

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఆగస్టు 30- సెప్టెంబర్ 05)

+5

కొత్తింట్లోకి అడుగు పెట్టిన హీరోయిన్.. గృహప్రవేశం (ఫొటోలు)