Breaking News

భూమిలో 285 అడుగుల లోతులో 'నగరం'.. 20 వేల మందిదాక..

Published on Sun, 07/16/2023 - 08:54

ఇదొక పురాతన అధోలోక నగరం. ప్రస్తుత తుర్కియాలోని కపడోసియ ప్రాంతంలో ఉంది. భూమి లోపల 285 అడుగుల లోతున పదకొండు అంతస్తుల్లో ఉన్న ఈ నగరాన్ని తొలి పర్షియన్‌ సామ్రాజ్యానికి చెందిన పాలకులు నిర్మించి ఉంటారని చరిత్రకారులు, పురాతత్త్వ శాస్త్రవేత్తల అంచనా. దీనిని క్రీస్తుపూర్వం 550 ప్రాంతంలో నిర్మించి ఉంటారని వారు భావిస్తున్నారు. ఇందులో ఇరవైవేల మంది నివాసం ఉండేందుకు తగిన ఏర్పాట్లు ఉన్నాయి.

నూనె గానుగలు, మద్యం పీపాలను భద్రపరచుకునే గదులు, తిండి గింజలు భద్రపరచుకునే గదులు, ప్రార్థన మందిరాలు వంటివీ ఉన్నాయి. దీని లోపలికి గాలి, వెలుతురు ప్రసరించేందుకు వీలుగా 180 అడుగుల పొడవైన మార్గం ఉండటం విశేషం. తొలిసారిగా దీనిని విహార యాత్రకు వచ్చిన ఒక కుటుంబం 1963లో గుర్తించడంతో ఈ నగరం గురించి ఆధునిక ప్రపంచానికి తెలిసింది. తుర్కియాలో దీనికి ‘డెరింకుయు’ అని పేరు పెట్టారు. అంటే నేలమాళిగ నగరం అని అర్థం. 

(చదవండి: టీచరే బడిదొంగ...  ఇరవై ఏళ్లుగా డుమ్మా!)

Videos

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)