Breaking News

సంక్షోభం ఒక క్రూరమైన గురువు

Published on Fri, 07/10/2026 - 14:03

ఆర్థిక సంక్షోభాల నుండి లభించే జీవిత పాఠాలు, వ్యాపార ప్రయోగాల ద్వారా మానవ మనస్తత్వాన్ని అర్థం చేసుకోవటం, ఆటోమేషన్‌ యుగంలో నైపుణ్యాల ప్రాముఖ్యం గురించి కునాల్‌ షా ఈ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడారు. ఇందులోని ముఖ్యాంశాలు:

నిన్నటి కష్టమే నేటి మన నమ్మకం
‘‘మా కుటుంబ వ్యాపారం దెబ్బతిన్నప్పుడు, మాకు అండగా నిలిచిన రక్షణ వలయాన్ని పూర్తిగా కోల్పోయాం. అప్పటినుండి బతకటం కోసమే కష్టపడ్డాను. పిల్లలకు ట్యూషన్లు చెప్పాను, ఒక సైబర్‌ కేఫ్‌ నడిపాను, పాటల సీడీలు అమ్మాను. మన విద్యావ్యవస్థ కేవలం రూల్స్‌ పాటించే మంచి ఉద్యోగులుగా తయారు చేయ డానికే శిక్షణ ఇస్తుంది కానీ బతకటానికి కావలసిన ప్రాథ మిక మెళకువలను నేర్పదు. నా 16వ ఏటనే ఈ ప్రపంచాన్ని ‘సప్లయ్‌ అండ్‌ డిమాండ్‌’ కోణంలో చూడటం వల్ల... ‘స్టార్టప్‌’ అనే పదాన్ని వినటానికి చాలా ముందే, మార్కెట్‌లో ఉన్న లోపాలను, అవకాశాలను ఎలా గుర్తించాలో నేర్చుకున్నాను. సంక్షోభం ఒక క్రూరమైన గురువు, కానీ అది మిమ్మల్ని ఇతరుల కన్నా ఎక్కువ దృఢంగా మార్చి, ఒక ప్రత్యేకమైన శక్తిని ఇస్తుంది.

మార్కెట్‌కు మేధస్సు ఎందుకు?
‘‘నన్ను నేను, అనుకోకుండా వ్యాపారవేత్తగా మారిన ఒక తత్వశాస్త్ర విద్యార్థిగా భావిస్తాను. మనుషులు ఏ పనినైనా ఎందుకు చేస్తారు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలనే విపరీతమైన ఆరాటం నాలో ఉంది. కేవలం పుస్తకాలు చదవడం, సిద్ధాంతాలను పోగుచేసు కోవడం  అనేది మేధోపరమైన అతిశయం మాత్రమే అవుతుంది. నా దృష్టిలో, ఒక కంపెనీని నిర్మించడం అత్యున్నత ప్రయోగశాల. మానవ ప్రవర్తన గురించి నాకో సిద్ధాంతం తోచినప్పుడు, నేను దాని గురించి కేవలం ఒక వ్యాసం రాసి వదిలేయను. ‘ఫ్రీచార్జ్‌’ లేదా ‘క్రెడ్‌’ లాంటి ఒక ప్రాడక్ట్‌ను నిర్మిస్తాను. లక్షల కొద్దీ ప్రజలు దానిని ఉపయోగిస్తే, మానవ స్వభావంపై నాకున్న అవగాహన సరైనదని అర్థం. వారు ఉపయోగించకపోతే, నేను తప్పు అని అర్థం. మన  ఐడియాలకు ఎలాంటి ఫిల్టర్లు లేకుండా నిజమైన స్కోరును ఇచ్చే ఏకైక రంగం వ్యాపారం మాత్రమే.

మిమ్మల్ని కాపాడేది మీ నైపుణ్యమే!
‘‘అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో మనం ఒక ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నాం. ఇక్కడ లేబర్‌ చౌకగా దొరుకుతుంది కాబట్టి, కేవలం మనుషులకు ఏదో ఒక పని కల్పించడం కోసమే కృత్రిమ లోపాలను/ అవసరాలను సృష్టించాం. లిఫ్ట్‌లో కేవలం బటన్‌ నొక్క డమే పనిగా ఉన్న మనుషులు కనిపిస్తారు. ఒక స్మార్ట్‌ కెమెరా చేయగలిగే సెక్యూరిటీ చెకింగ్‌ పనిని ముగ్గురు వ్యక్తులు చేస్తుంటారు. పెట్టుబడిదారీ విధానం, ఆటోమే షన్‌ దూసుకుపోతున్న కొద్దీ, ఇలాంటి అనవసరమైన ఉద్యోగాలు రాత్రికి రాత్రే తుడిచి పెట్టుకుపోతాయి. సామర్థ్యం లేకుండా ఉద్యోగాలను మీరు ఎప్పటికీ కాపాడుతూ కూర్చోలేరు. ఇంటర్నెట్‌కు, ఏఐకి మీ సెంటి మెంట్లతో పని లేదు. వాటికి మీ నైపుణ్యం కావాలి.

సంకుచిత ఆలోచన సంపదనివ్వదు!
‘‘చాలామంది ‘కొరత మానసిక స్థితి’లో ఉంటారు. వారు ఎవరినైనా కలిసినప్పుడు, ‘ఈ వ్యక్తి నుండి నేను ఏం ఆశించవచ్చు?’ అని ఆలోచిస్తూ గదిలోకి అడుగు పెడతారు. ఆర్థికంగా వెనుకబడే ఉండటానికి ఇది వేగ వంతమైన మార్గం. నాకు తెలిసిన సంపన్నులు ‘సమృద్ధి ఆలోచనా విధానం’తో పని చేస్తారు. తమ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరినీ విజయపథంలో నడిపించాలనే తపన వారిలో బలంగా ఉంటుంది. మీ చుట్టూ ఉన్న వ్యవస్థకు సంబంధించిన మొత్తం లాభాల పరిధిని పెంచడం పైనే మీరు దృష్టి పెడితే, అందులో మీ వాటా సహజంగానే చాలా పెద్దదవుతుంది.
- ఎడిటోరియల్‌ టీమ్‌

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)