Breaking News

హత్యాచారం దోషుల్ని కఠినంగా శిక్షించాలి

Published on Sun, 11/03/2024 - 05:32

కడియం: తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంక పంచాయతీలోని బుర్రిలంకలో మహిళపై అత్యాచారం చేసి, హత్యచేసిన వారిని కఠినంగా శిక్షించాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా ఎస్పీ డి.నరసింహకిశోర్‌ని కోరారు. వారు శనివారం రాజమహేంద్రవరంలో ఎస్పీని కలిసి ఈ మేరకు వినతిపత్రం ఇచ్చారు. అనంతరం వారు పార్టీ నాయకులతో కలిసి బుర్రిలంకలో బాధితురాలు రౌతు కస్తూరి కుటుంబాన్ని పరామర్శించారు. 

పార్టీ తరఫున రూ.1.1 లక్షల ఆర్థికసాయం అందజేశారు. న్యాయం జరిగేంతవరకు తాము అండగా ఉంటామని బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పారు. అనంతరం వారు మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ తరఫున తాము వస్తున్నామని.. కూటమి ఎమ్మెల్యే హడావుడిగా వచ్చి బాధితుల చేతిలో రూ.పదివేలు పెట్టి వెళ్లడం చూస్తుంటే ఈ ఘటన పట్ల ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉందో తెలుస్తోందని చెప్పారు. పత్రికలు తిరగేస్తే ఓ హత్య, ఓ మానభంగం కచ్చితంగా కన్పిస్తున్నాయన్నారు. ఇలాంటి దారుణాలను ప్రశ్నిస్తున్న వైఎస్సార్‌సీపీ వాళ్ల కాళ్లు విరగ్గొడతామని, 11 సీట్లు వచ్చినా నోరు లేస్తోందా అంటూ బెదిరిస్తున్నారని చెప్పారు. 

దిశ యాప్‌ తీసేయడం ద్వారా నేరాలు చేసేవారికి రక్షణ కల్పిస్తామని భరోసా ఇచ్చినట్లయిందన్నారు. ఇంత పాశవికంగా మహిళను హత్య చేస్తే జనసేన, టీడీపీ నాయకులు బైటకు పొక్కకుండా చేయాలని ప్రయత్నించడం శోచనీయమని చెప్పారు. దోషు­లను కఠినంగా శిక్షించకపోతే తమపార్టీ ఉద్యమి­స్తుందని వారు తెలిపారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించినవారిలో వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, డీసీసీబీ మాజీ చైర్మన్‌ ఆకుల వీర్రాజు, రుడా మాజీ చైర్‌ç­³ర్సన్‌ మేడపాటి షర్మిలారెడ్డి, రాజమహేంద్రవరం పార్లమెంట్‌ నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి డాక్టర్‌ గూడూరి శ్రీనివాస్, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు నక్కా రాజబాబు, గిరజాల బాబు తదితరులున్నారు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)