షూట్‌ విషయంలో గొడవ.. బిల్డింగ్‌పై నుంచి దూకిన యూట్యూబ్‌ జంట

Published on Sat, 04/13/2024 - 19:24

క్షణికావేశంలో తీసుకునే కఠిన నిర్ణయాలకు భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. చిన్న చిన్న సంఘటనలు చిలికి చిలికి గాలి వానలా మారడంతో నిండు జీవితాలు బలైపోవడమే కాకుండా.. కుటుంబీకుల్లోనూ కొండంత విషాదాన్ని మిగిల్చుతుంది. తాజాగా ఇలాంటి ఘటనే హర్యానాలోని బహదూర్‌ఘర్‌లో వెలుగుచూసింది. ఓ విషయంలో గొడవపడిన  జంట.. తొందరపాటు నిర్ణయంతో బిల్డింగ్‌పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులను డెహ్రడూన్‌కు చెందిన గర్విత్‌ 25, నందిని 22గా గుర్తించారు. 

గర్విత్‌, నందిని ఇద్దరూ కంటెంట్‌ క్రియేటర్స్‌, సొంతంగా ఛానల్‌  పెట్టి యూట్యూబ్‌, ఇన్‌స్టాగ్రామ్‌,ఫేస్‌బుక్‌ వంటి సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో రీల్స్‌, షార్ట్‌ వీడియోలు చేస్తూ ఉంటారు. కొన్ని రోజుల కిత్రమే ఈ జంట తమ టీమ్‌తో కలిసి డెహ్రడూన్‌ నుంచి బహదూర్‌ఘర్‌కు మారారు. రుహీలా రెసిడెన్సీలోని ఏడవ అంతస్తులో ఓ ఫ్లాట్‌ను అద్దెకు తీసుకొని ఉంటున్నారు. టీమ్‌లోని మరో అయిదుగురు రూమ్‌మేట్స్‌తో జీవిస్తున్నారు.

ఈ క్రమంలో బయట షూటింగ్‌ పూర్తి చేసుకొని శనివారం తెల్లవారుజామున ఇంటికి వచ్చారు. అయితే ఇద్దరి మధ్య షూట్‌ విషయంలో వాగ్వాదం ఏర్పడింది. ఇది కాస్తా పెరిగి పెద్దది అవ్వడంతో క్షణికావేశంలో జంట బిల్డింగ్‌ ఏడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

చివరగా.. ఏ సమస్యకైనా ఆలోచిస్తే తప్పక పరిష్కారం ఉంటుంది.. ప్రాణానికి మించింది ఏదీ లేదు.. క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకొని జీవితాలను బలితీసుకోవద్ద

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)