Breaking News

8 ఏళ్లుగా సహజీవనం.. చివరికి షాకింగ్‌ ట్విస్ట్‌.. అసలేం జరిగిందంటే?

Published on Sat, 03/25/2023 - 08:12

హైదరాబాద్ : సహజీవనం చేస్తున్న వ్యక్తి వేధింపులు భరించలేక ఓ యువతి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన శుక్రవారం బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పెద్దపల్లి జిల్లా బోట్లవనపర్తికి చెందిన పల్లవి (27) నగరంలో ఉంటూ ప్రైవేటు ఉద్యోగం చేస్తుంది. కొన్నేళ్ల క్రితం  ఇందిరానగర్‌కు చెందిన సదానందంతో పరిచయం ఏర్పడింది. సదానందం పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో 8 ఏళ్లుగా అతనితో సహజీవనం చేస్తుంది.

అతడికి భార్య పిల్లలు ఉన్నట్లు తెలిసినా పల్లవి సర్దుకుపోయింది. అయితే సదానందం తరచూ ఆమెను  కొట్టేవాడు. ఈ విషయాన్ని పల్లవి పలుమార్లు తల్లి దృష్టికి తీసుకెళ్లింది. ఈ నెల 22న తల్లికి ఫోన్‌ చేసి సదానందం వేధింపులు భరించలేకపోతున్నానని ఊరికి వచ్చేస్తానని చెప్పింది. మరుసటి రోజు రాత్రి కూడా సదానందం ఆమెపై దాడి చేయడంతో మనస్తాపానికిలోనైన పల్లవి ఇంట్లో ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

దీనిని గుర్తించిన సదానందం బస్తీ వాసులతో కలిసి ఆమెను కిందకు దించి పరిశీలించగా అప్పటికే మృతి చెందింది. మృతురాలి తల్లి ఫోన్‌ ద్వారా ఫిర్యాదు చేయడంతో బంజారాహిల్స్‌ పోలీసులు సదానందంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.   

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)