Breaking News

రూ.50 లక్షల కట్నం, బైక్‌ ముందే కావాలి.. ఇస్తేగాని పెళ్లి చేసుకోను

Published on Sun, 04/09/2023 - 10:32

పటాన్‌చెరు టౌన్‌: కట్నం, బైక్‌ ముందే కావాలని, ఇస్తేగాని పెళ్లి చేసుకునేది లేదని ఓ యువకుడు ఫోన్‌లో యువతిని తిడుతూ అడగటంతో మనస్తాపం చెందిన యువతి రెండో అంతస్తు పైనుంచి దూకి ఆత్మహత్యయు యత్నించింది. ఈ సంఘటన పటాన్‌చెరు పోలీసు స్టేషన్‌ పరిధిలో జరిగింది. యువతి కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పటాన్‌చెరు పట్టణంలోని నాయికోటి బస్తీకి చెందిన జంగయ్య కూతురు యామినికి పటాన్‌చెరు మండలం భానూర్‌ కంచర్లగూడెంకు చెందిన జంగయ్య అక్క లక్ష్మి కుమారుడు చిన్నోల శంకర్‌తో మార్చి 26వ తేదీన నిశ్చితార్థం జరిగింది. 

ఆ సమయంలో రూ.50 లక్షలు కట్నం భూమి అమ్మిన తర్వాత ఇస్తామని చెప్పడంతో శంకర్‌ కుటుంబ సభ్యులు ఒప్పుకున్నారు. నిశ్చితార్థం జరిగిన మార్నాడే కట్నంతో పాటు బైక్‌ ముందే కావాలని యువతికి ఫోన్‌ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడి అడిగాడు. దీంతో యువతి కుటుంబ సభ్యులు శుక్రవారం యువకుడి ఇంటికి వెళ్లి మాట్లాడేందుకు వెళ్లడంతో తనకు పెళ్లి అవసరం లేదంటూనిశ్చితార్థం సమయంలో పెట్టిన రింగ్‌ తీసి పడేశాడు.

దీంతో యువతి కుటుంబ సభ్యులు మళ్లీ మాట్లాడుదామని చెప్పి ఇంటికి వచ్చారు. దీంతో మనస్తాపం చెందిన యువతి భవనం రెండో అంతస్తు పైనుంచి దూకడంతో తీవ్రంగా గాయపడింది. కుటుంబ సభ్యులు వెంటనే యామినిని చికిత్స కోసం పట్టణంలో ఉన్న ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమె పరిస్థితి మిషయంగా ఉందని వైద్యులు తెలిపారు. కట్నకానుకల విషయంలో శంకర్, అతడి కుటుంబ సభ్యులు వేధించడంవల్లే తమ కూతురు ఆత్మహత్యకు యత్నించిందని  కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.   

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)