లోన్‌ యాప్‌ వేధింపులకు యువకుడు బలి 

Published on Wed, 02/22/2023 - 05:00

చల్లపల్లి: లోన్‌యాప్‌ వేధింపులకు ఓ యువకుడు బల­య్యాడు. కృష్ణాజిల్లా చల్లపల్లికి చెందిన టైలర్‌ మహమ్మద్‌ ఇనాయతుల్లా (ఛన్నా) ఏకైక కుమారుడు మహమ్మద్‌ బాబ్‌జాన్‌ (31)కు రెండేళ్ల క్రితం వివాహమైంది. పదకొండు నెలల బాబు ఉన్నాడు. బాబ్‌జాన్‌ వృత్తి రీత్యా ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడలోని విజయ పాల ఫ్యా­క్టరీలో కొన్నేళ్లుగా ఎలక్ట్రీషియన్‌గా ఉద్యోగం చేస్తున్నాడు.

ఇటీవల లోన్‌ యాప్‌ద్వారా రూ.30 వేల రుణం తీసుకున్నాడు. రుణం చెల్లించాలని నిత్యం లోన్‌ యాప్‌ వేధింపులు ఎక్కువయ్యాయి. ఇటీవల బాబ్‌జాన్‌ తండ్రికి లోన్‌ యాప్‌ వారు ఫోన్‌ చేసినపుడు అప్పు ఉంటే చెల్లిస్తామని చెప్పారు.

అయినప్పటికీ అశ్లీల, అసభ్యకర పోస్టులు పెడుతూ.. నిత్యం వేధింపులు కొనసాగించారు. దీంతో తీవ్ర మానసిక క్షోభకు గురైన బాబ్‌ జాన్‌  సోమవారం రాత్రి విజయవాడలోని తన రూమ్‌లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటనపై కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

Videos

YSR ఫ్లెక్సీలు చింపేసిన దుండగులు.. కూకట్‌పల్లి లో YSRCP ఆందోళన

42 ఉద్యోగ సంఘాలకు లేఖ రాసిన ఏపీ JAC అమరావతి

Srinivasulu Reddy: కొడుకు కోసం మరీ ఇంత దిగజారుతావా..?

ఆపరేషన్ ‘రాటెన్ యాపిల్’.. న్యూయార్క్‌లో వేలాది మంది వలసదారుల అరెస్ట్

స్పోర్ట్స్ కోటాలో DSC అక్రమాలు బట్టబయలు..

బాబు పబ్లిసిటీపై YS జగన్ ఆగ్రహం

దారుణం చీకటిలోకి నేపాల్..నెక్స్ట్ స్టెప్ ఏంటి..?

ఢిల్లీలో YSR అవార్డ్స్-2026 ప్రదానోత్సవం

జీవీఎంసీ మేయర్ సీటుపై కూటమిలో పీఠముడి

మెదక్ లో కాంగ్రెస్ పాలిటిక్స్

Photos

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)

+5

పని.. ‍ప్రకృతిలో మమేకం.. శ్రీనిధి జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

అమ్మ చేతి వంట.. వేపపుల్లతో బ్రషింగ్.. షాకిచ్చిన శోభిత (ఫొటోలు)