Breaking News

ప్రేమోన్మాది ఆత్మహత్య

Published on Fri, 07/12/2024 - 05:30

రాంబిల్లి (అచ్యుతాపురం): తన ప్రేమను నిరాకరించి, జైలుకు పంపిందనే పగతో 14 ఏళ్ల బాలికను ఐదురోజుల క్రితం హతమార్చిన ప్రేమోన్మాది చివరకు శవమై కనిపించాడు. అతని మృతదేహం బాలిక ఇంటి సమీపంలోని గడ్డిదుబ్బుల్లో లభ్యమైంది. అనకాపల్లి జిల్లా, రాంబిల్లి మండలం,  కొప్పుగొండుపాలెంలో బద్ది దర్శిని(14) అనే బాలికను ఈనెల 6వ తేదీ రాత్రి కశింకోట మండలానికి చెందిన సురేశ్‌ గొంతు కోసి హతమార్చాడు. ప్రేమ పేరుతో వేధిస్తున్న అతనిపై దర్శిని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోక్సో కేసు పెట్టి అరెస్టు చేశారు. బాలికను రాంబిల్లి మండలంలో అమ్మమ్మ ఇంట చదివిస్తున్నారు. 

బెయిల్‌పై వచ్చిన సురేశ్, తనను జైలుకు పంపిందన్న కక్షతో దర్శినిని హతమార్చాడు. ఘటనా స్థలంలో వదిలి వెళ్లిన లేఖలో ‘ఇద్దరం కలిసి ఉండాలి.. లేదా ఇద్దరం చనిపోవాలి’ అని పేర్కొన్నాడు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన కొద్దికాలానికి జరిగిన ఈ ఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు 12 బృందాలను ఏర్పాటు చేశారు. ఈక్రమంలో గురువారం బాలిక ఇంటికి సుమారు రెండు వందల మీటర్ల దూరంలో కొండలాంటి ప్రాంతంలో గడ్డిదుబ్బుల మాటున సురేశ్‌ శవమై కనిపించాడు. బుధవారం సాయంత్రం అక్కడికి సమీపంలోని రైతులకు దుర్వాసన వచ్చింది. అప్పటికే చీకటి పడటంతో మరుసటిరోజు ఉదయం పరిశీలించగా కుళ్లిపోయిన స్థితిలో ఉన్న ఓ యువకుని మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. 

పరవాడ డీఎస్పీ సత్యనారాయణ, సీఐ నర్సింగరావు నేతృత్వంలోని బృందం శవాన్ని పరిశీలించి లభించిన ఆధారం మేరకు సురేశ్‌గా నిర్థారించారు. ఆత్మహత్యకు పాల్పడ్డాడని తెలిపారు. సురేశ్‌ జేబులో కొంత నగదు, రాసిన లేఖ జిరాక్స్‌ కాపీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలిస్తున్న సమయంలో ఆ వాహనాన్ని దర్శిని కుటుంబీకులు అడ్డుకున్నారు. తమ కుమార్తెకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. ఇదిలా ఉంటే... బెయిల్‌పై బయటకు వచ్చిన వ్యక్తికి సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించి, బాలిక కుటుంబాన్ని అప్రమత్తం చేస్తే ఇటువంటి దురాగతం జరిగేది కాదనే విమర్శలు వినిపిస్తున్నాయి. 

నిందితుడు మళ్లీ బాలిక వెంట పడుతున్నట్టు ఆమె కుటుంబ సభ్యులు రాంబిల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిసిందని, దీనిపై వారు ఎలాంటి చర్యలు తీసుకున్నారని ఘటన జరిగిన మర్నాడు అనకాపల్లిలో హోంమంత్రి అనితను విలేకరులు ప్రశ్నించగా, అలాంటిది జరిగినట్టు తన దృష్టికి రాలేదని, అదే నిజమైతే సంబంధిత పోలీస్‌ సిబ్బందిపై చర్యలు చేపడతామని చెప్పారు. చివరకు రాంబిల్లి ఎస్‌ఐ ముకుందరావును బుధవారం వీఆర్‌పై పంపారు. ఇంత జరిగినా బాలిక కుటుంబాన్ని హోం మంత్రి పరామర్శించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

Videos

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)