Breaking News

ప్రేమోన్మాది నాగరాజుకు ఉరిశిక్ష విధించాలి

Published on Sun, 05/19/2024 - 07:36

నెల్లూరు(అర్బన్‌): ప్రేమ పేరుతో వెంటపడి వేధించి పెళ్లికి ఒప్పుకోలేదనే కారణంతో తల్లీకూతుళ్లపై హత్యాయత్నం చేసిన క్రూరుడు నాగరాజును సమాజంలో తిరగనీయకూడదని, అలాంటి వ్యక్తికి ఉరిశిక్ష విధించాలని మహిళా కమిషన్‌ రాష్ట్ర చైర్‌పర్సన్‌ గజ్జల వెంకటలక్ష్మి అన్నారు.

 శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వింజమూరులో పూజిత, ఆమె తల్లి కాంతమ్మలపై నిందితుడు నాగరాజు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో తీవ్రంగా గాయపడి నెల్లూరులోని ఎనెల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పూజిత, కాంతమ్మను మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ గజ్జల వెంకటలక్ష్మి శనివారం పరామర్శించారు. బాధితులకు ధైర్యం చెప్పి ప్రభుత్వం తరపున అండగా ఉంటామని తెలిపారు. ఆమె విలేకరులతో మాట్లాడుతూ మహిళలపై దాడులకు పాల్పడే వారిని ఉపేక్షించేది లేదన్నారు.

 బాధితులకు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా మెరుగైన వైద్యం అందించాలని ఆస్పత్రి యాజమాన్యానికి ఆదేశాలిచ్చామన్నారు. అనంతరం ఆమె దర్గామిట్టలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి ఆవరణలో ఉన్న వన్‌స్టాప్‌ సఖి సెంటర్‌ను సందర్శించి రికార్డులను పరిశీలించారు.  దిశ ప్రొటెక్షన్‌ వెల్ఫేర్‌ ఫౌండేషన్‌ రాష్ట్ర కార్యదర్శి వల్లెం విమల, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు విజయనిర్మల, రాజ్యలక్ష్మి, అధికార ప్రతినిధి సుప్రియ పాల్గొన్నారు.

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)