Breaking News

ఆస్పత్రి దూరమై.. రహదారి నరకమై..

Published on Sat, 08/31/2024 - 04:35

చింతూరు:  సకాలంలో వైద్యం అందకపోవడంతో అప్పుడే పుట్టిన మగబిడ్డ మృత్యువాత పడిన విషాద ఘటన చింతూరు మండలం కలిగుండంలో శుక్రవారం చోటు చేసుకుంది. కలిగుండం గ్రామానికి చెందిన కుంజా జయమ్మ స్థానిక మినీ అంగన్‌వాడీ కేంద్రంలో వర్కర్‌గా పనిచేస్తున్నది. గర్భిణీ అయిన జయమ్మకు ఇటీవల పరీక్షలు నిర్వహించగా వచ్చేనెల 18న కాన్పు అయ్యే అవకాశముందని వైద్యులు చెప్పినట్లు ఆమె భర్త సీతారాం తెలిపాడు. 

అయితే శుక్రవారం తెల్లవారుజామున జయమ్మకు అకస్మాత్తుగా పురిటినొప్పులు రావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు భర్త సీతారాం సిద్ధమయ్యాడు. తమ గ్రామం నుంచి వాహన సౌకర్యం లేకపోవడంతో ఆమెను రెండు కిలోమీటర్ల దూరంలోని పేగకు కాలినడకన తీసుకెళ్లేందుకు గ్రామస్తుల సాయం కోరాడు. మార్గమధ్యంలో ఉధృతంగా ప్రవహిస్తున్న చంద్రవంక వాగును ప్రాణాలకు తెగించి దాటించి పేగకు చేరుకున్నారు. 

అప్పటికే పురిటి నొప్పులతో అల్లాడిన జయమ్మకు వ్యయప్రయాసతో గుండెల్లోతు నీళ్లలో వాగు దాటడంతోపాటు, రెండు కిలోమీటర్లు కాలినడకన రావడంతో నొప్పులు అధికమయ్యాయి. దీంతో ఆమెకు తోడుగా వచ్చిన ఆశా కార్యకర్త వెంటనే పేగలోనే ఓ ఇంటిలో కాన్పు చేయడంతో జయమ్మ మగబిడ్డకు జన్మనిచ్చి0ది.  

బిడ్డను కాపాడుకునేందుకు.. 
పుట్టిన బిడ్డకు అస్వస్థతగా ఉండడంతో ఆ బిడ్డను కాపాడుకునేందుకు పేగ నుంచి ఆటోలో ఏడు కిలోమీటర్ల దూరంలోని ఏడుగురాళ్లపల్లి ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు పరీక్షించి బిడ్డ పరిస్థితి విషమంగా ఉందని, చింతూరు ఏరియా ఆస్పత్రిలోని చిన్నపిల్లల వైద్యుని వద్దకు తీసుకెళ్లాలని సూచించారు. 

అంబులెన్సులో చింతూరు ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడి వైద్యులు పరీక్షించి మార్గమధ్యంలోనే బిడ్డ మృతి చెందిందని చెప్పారు. దీంతో బిడ్డను కోల్పోయిన దంపతులు గుండెలవిసేలా రోదించడం అక్కడి వారిని కంటతడి పెట్టించింది. 

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)