Breaking News

భర్త హోటల్‌లో పని చేసే సప్లయర్‌తో భార్య వివాహేతర సంబంధం

Published on Tue, 07/04/2023 - 08:55

కర్ణాటక: భర్తను హత్య చేసిన కేసులో భార్య, ప్రియుడి సహా ఐదుగురిని తలఘట్టపుర పోలీసులు అరెస్ట్‌ చేశారు. వివరాలు...గతనెల 29న గుర్తు తెలియని వ్యక్తి హత్య కేసును నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేయగా వివాహేతర సంబంధమే హత్యకు కారణమని తేల్చారు. రామనగర జిల్లా చన్నపట్టణ తాలూకా నణ్ణూరుకు చెందిన అరుణ్‌కుమార్‌ (34) ఆర్‌ఆర్‌నగర ఉత్తరహళ్లి రోడ్డులో జేఎస్‌ఎస్‌ కళాశాల పక్కన హోటల్‌ నడిపిస్తున్నాడు. ఆ హోటల్‌కు గణేశ్‌ అనే వ్యక్తి నీటిని సరఫరా చేస్తున్నాడు. ఇతనితో అరుణ్‌కుమార్‌ భార్య రంజిత వివాహేతర సంబంధం పెట్టుకుంది.

దీనికి తోడు అరుణ్‌కుమార్, గణేశ్‌తో చేబదులుగా కొంత నగదు తీసుకున్నాడు. ఇదిలా ఉంటే గణేశ్, రంజిత వివాహేతర సంబంధం గురించి అరుణ్‌ తెలుసుకుని భార్యను తీవ్రంగా మందలించాడు. తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను ఎలాగైనా  తొలగించుకోవాలని ప్రియుడితో కలిసి పథకం వేసింది. గతనెల 28న పార్టీ చేసుకుందామని చెప్పి అరుణ్‌ను గణేశ్‌ అతని శివానంద, దీపు, శరత్‌లు పిలిపించారు.

అరుణ్‌ రాగానే అతని కళ్లపై కారంపొడి చల్లి మారణాయుధాలతో చంపి హత్య చేశారు. మరుసటి రోజు తలఘట్టపుర పోలీసులు గుర్తు తెలియని మృతదేహంగా  కేసు నమోదు చేశారు. అనంతరం విచారణలో భాగంగా  రంజిత మొబైల్‌ ఫోన్‌కాల్‌ డేటా పరిశీలించగా అసలు విషయం బయటపడింది. ఐదుగురు నిందితులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)