Breaking News

సుపారీ ఇచ్చి.. భర్తను హత్య చేయించి

Published on Sun, 01/21/2024 - 04:34

జోగిపేట (అందోల్‌): వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని సుపారీ ఇచ్చి భర్తను భార్య హత్య చేయించి మృతదేహాన్ని తగలబెట్టించిన ఘటన సంగారెడ్డి జిల్లా జోగిపేటలో శనివారం వెలుగుచూసింది. సంగారెడ్డి డీఎస్పీ రమేశ్‌కుమార్‌ కథనం ప్రకారం..  జోగిపేటకు చెందిన పాపన్నపేట మల్లేశం(30)కు అందోల్‌ మండలం మన్‌ సాన్‌పల్లికి చెందిన కల్పనతో 2015లో వివా హం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం. జోగిపేట పట్టణం అందోల్‌లోని డబుల్‌ బెడ్‌రూం కాలనీల వద్ద వీరు నివాసం ఉంటున్నారు.

కల్పనకు మన్‌సాన్‌పల్లికి చెందిన మస్కూరి మహేశ్‌తో పెళ్లికి మందు నుంచీ సంబంధం ఉంది. వివాహం తర్వాత కూడా ఈ బంధాన్ని కొనసాగిస్తోంది. ఈ విషయమై మల్లేశం కుటుంబంలో తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈక్రమంలో  భర్తను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని భావించి విషయం ప్రియుడు మస్కూరి మహేశ్‌కి వివరించింది.

దీంతో మహేశ్‌.. రంగంపేటకు చెందిన తన మేనబావ ఉసికే అంబాజీకి చెప్పగా, అదే గ్రామానికి చెందిన పాత నేరస్తుడు తలారి మహేశ్‌తో పరిచయం చేయించి, రూ.50 వేలకు హత్య చేసేలా సుపారీ మాట్లాడుకున్నారు. అడ్వాన్సుగా రూ.5 వేలు ఇవ్వగా, పలుమార్లు మరో రూ.30 వేలను అందజేశారు. ఈ విషయంలో తన స్నేహితుడు, గంగారం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్‌ వజ్జరి మహేశ్‌ సహకారం తీసుకున్నారు. 

హత్య జరిగిందిలా..
వజ్జరి మహేశ్, మస్కూరి మహేశ్, తలారి మహేశ్‌.. ఈ ముగ్గురూ ఓ  కారు అద్దెకు తీసుకుని శుక్రవారం తెల్లవారుజామున కల్పన ఇంటి వద్దకు వెళ్లి కాపుకాశారు. 5:30 గంటల ప్రాంతంలో మల్లేశం బయటకు రాగానే అతని తలపై బండరాయితో మస్కూరి మహేశ్‌ బలంగా కొట్టడంతో స్పృహకోల్పోయాడు. వెంటనే అతడిని కారులో వేసుకుని సంగుపేట వైపు వెళ్లారు. మల్లేశం చేతులను కట్టేసి, గొంతు నొక్కడంతో అతను కారులోనే మృతి చెందాడు.

శుక్రవారం సాయంత్రం కోనాపూర్‌ చెరువు వద్ద మృతదేహంపై పెట్రోల్‌ పోసి నిప్పంటించి నిందితులు పారిపోయారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. మల్లేశం భార్య కల్పనను అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించగా.. అసలు విషయాలు వెలుగుచూశాయి. నిందితులు మస్కూరి మహేశ్, కల్పన, తలారి మహేశ్, వజ్జరి మహేశ్, ఉసికే అంబాజీలను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. కాగా కేసును కేవలం 22గంటల వ్యవధిలో ఛేదించిన జోగిపేట పోలీసులను ఎస్పీ రూపేశ్‌ అభినందించారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)