నేను లీవ్‌ అడిగితే ఇవ్వరా? ప్రభుత్వ ఉద్యోగి ఏం చేశాడో చూడండి!

Published on Fri, 02/07/2025 - 11:48

కోల్‌కతా : అత్యవసర పని పడింది. నేను అడిగింది లీవే కదా. లీవ్‌ ఎందుకు ఇవ్వరని ప్రశ్నిస్తూ.. విధి నిర్వహణలో ప్రభుత్వ ఉద్యోగి సహనం కోల్పోయాడు. తాను సెలవు అడిగితే ఉన్నతాధికారి కాదనడంతో కోపం కట్టలు తెంచుకుంది. తన వెంట తెచ్చుకున్న కత్తితో ఉన్నతాధికారితో పాటు సహచర ఉద్యోగులపై  దాడి చేశాడు. అనంతరం, అదే కత్తితో తిరుగుతూ కనిపించారు. ఇప్పుడా దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో న్యూటౌన్ ప్రాంతానికి చెందిన కరిగరి భవన్‌లోని సాంకేతిక విద్యా విభాగంలో అమిత్ కుమార్ సర్కార్‌ విధులు నిర్వహిస్తున్నారు. ఈ తరుణంలో ఎప్పటిలాగే ఆఫీస్‌కు వచ్చిన కుమార్‌ లీవ్‌ కావాలని ఉన్నతాధికారిని అడిగారు. ఆ విషయంలో తన సహోద్యోగులతో గొడవ జరిగింది. ఈ గొడవలో అమిత్‌ వెంట తెచ్చుకున్న కత్తితో సహచర ఉద్యోగులపై దాడి చేశారు. 

అనంతరం, అక్కడి నుంచి వెళ్లి పోయారు. వీపున బ్యాగు, రక్తంతో తడిసిన కత్తితో వెళ్తున్న అమిత్‌ను స్థానికులు వీడియోలు తీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆఫీస్‌లో జరిగిన ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు నిందితుణ్ని అదుపులోకి తీసుకున్నారు.

ఈ ఘటనపై పోలీస్‌ అధికారి మాట్లాడుతూ.. నిందితుడు తన సహోద్యోగులతో సెలవు విషయంలో గొడవ పడ్డాడు. సెలవు నిరాకరించడానికి గల కారణం, సహోద్యోగులపై కత్తితో ఎందుకు దాడి చేశారో తెలియాల్సి ఉంది. నిందితుడికి మానసిక ఆరోగ్య సమస్యలు ఉన్నాయని అనుమానిస్తున్నాం. ఆ కోణంలో కేసు దర్యాప్తు చేస్తాం. కాగా, అమిత్‌ కత్తిదాడిలో జయదేబ్ చక్రవర్తి, శాంతను సాహా, సర్తా లేట్, షేక్ సతాబుల్‌ గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. 

#

Tags : 1

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)