Breaking News

విషమంగానే ప్రీతి ఆరోగ్యం 

Published on Fri, 02/24/2023 - 01:55

సాక్షి ప్రతినిధి, వరంగల్‌/హైదరాబాద్‌: వరంగల్‌ ఎంజీఎంలో ఆత్మహత్యకు యత్నించిన పీజీ వైద్య విద్యార్థిని ధరావత్‌ ప్రీతి ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. అంతర్గత అవయవాలు ఫెయిలైన స్థితిలో ఆమెను నిమ్స్‌కు తెచ్చారని, గుండె, ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపరిచేందుకు ఎక్మో, సీఆర్‌ఆర్టీలతో ప్రయత్నం చేస్తున్నామని నిమ్స్‌ వైద్యులు వివరించారు. అన్ని విభాగాలకు చెందిన వైద్య నిపుణుల బృందం పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోందని తెలిపారు. ఈమేరకు గురువారం రాత్రి విడుదల చేసిన హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొన్నారు. సీనియర్‌ విద్యార్థి చేతిలో వేధింపులకు గురైన ప్రీతి బుధవారం ఎంజీఎం ఆస్పత్రిలో ఇంజక్షన్‌ వేసుకుని ఆత్మహత్యకు యత్నించిన సంగతి తెలిసిందే. 
 
పోలీసుల అదుపులో సైఫ్‌? 
ప్రీతి తండ్రి నరేందర్‌ నాయక్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడు, సీనియర్‌ విద్యార్థి డాక్టర్‌ సైఫ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. సైఫ్‌పై ర్యాగింగ్, వేధింపులు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేశారు. వరంగల్‌ సీపీ ఏవీ రంగనాథ్‌ ఆదేశాల మేరకు ఏసీపీ బోనాల కిషన్‌ గురువారం కేఎంసీ, ఎంజీఎంలో విచారణ జరిపారు. ప్రీతి, సైఫ్‌ల సెల్‌ఫోన్‌లను సీజ్‌ చేసిన పోలీసులు.. కాల్‌డేటా ఆధారంగా కూడా విచారిస్తున్నారు.

అదేవిధంగా ప్రీతి ఆత్మహత్యాయత్నానికి సైఫ్‌ వేధింపులే కారణమా..? ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? అనే కోణంలో కూడా ఆరా తీశారు. మరోవైపు, ప్రీతి ఆత్మహత్యాయత్నం ఘటనపై ఎంజీఎం ఆస్పత్రిలో వైద్యులతో కూడిన త్రిసభ్య కమిటీ విచారణ చేపట్టింది. ప్రీతి సహచర విద్యార్థులు, అనస్థీషియా విభాగ వైద్యులతో మాట్లాడి ప్రాథమిక నివేదిక తయారుచేసింది.

ఈ నివేదికను శుక్రవారం డీఎంఈకి పంపనున్నట్లు ఎంజీఎం పరిపాలనాధికారులు పేర్కొన్నారు. కాగా, ప్రీతి, సైఫ్‌ ఇద్దరి కుటుంబాలదీ రైల్వే బ్యాక్‌ గ్రౌండే కావడం గమనార్హం. ప్రీతి తండ్రి ధరావత్‌ నరేందర్‌ నాయక్‌ వరంగల్‌ రైల్వే ప్రొటెక్షన్స్‌ ఫోర్స్‌లో ఏఎస్‌ఐగా పని చేస్తుండగా, సైఫ్‌ తండ్రి సలీం కాజీపేటలో రైల్వే డీజిల్‌ లోకోషెడ్‌లో పని చేస్తున్నారు.  
 
సరస్వతీ పుత్రిక 
ఎంజీఎం: ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ప్రీతి సర్వసతీ పుత్రిక అని కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు చెబుతున్నారు. ఎస్‌ఎస్‌సీలో 600కు గాను 526 మార్కులు సాధించింది. ఇంటర్‌లో వెయ్యి మార్కులకు 970 సాధించింది. ఎంసెట్‌ ఎంట్రన్స్‌లో 5 వేల ర్యాంకు సాధించి కామినేని మెడికల్‌ కళాశాలలో ఎంబీబీఎస్‌ సీటు సాధించింది.

2013లో వైద్యవిద్యను ప్రారంభించి 2019లో పూర్తిచేసింది. పీజీ ఎంట్రన్స్‌లో ఆలిండియా 1161 ర్యాంకు సాధించి కేఎంసీలో అనస్థీషియా విభాగంలో అడ్మిషన్‌ పొందింది. అన్ని స్థాయిల్లో మెరుగైన ఫలితాలు సాధిస్తూ వస్తున్న ప్రీతి ఎలాంటి మానసిక ఒత్తిళ్లకు తలొగ్గేది కాదని, వైద్యవిద్య అంటే ఆమెకు ఇష్టమని కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు.  

Videos

తాడిపత్రిలో ఎన్నికల టెన్షన్.. YSRCP జాఫర్ ను కిడ్నాప్ చేసిన జేసీ వర్గీయులు

మైదుకూరు నామినేషన్ సెంటర్లో కి వెళ్ళి... దౌర్జన్యం చేసిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్

ZPTC, MPTC స్థానాలకు షెడ్యూల్

ఇక దోమల శకానికి ముగింపు.. ఏఐతో అద్భుత ఆవిష్కరణ

పులివెందులలో ఉద్రిక్తత.. అవినాష్ రెడ్డి సహా వందల మందిపై కేసులు

ప్రతి కార్యకర్త తిరగబడండి.. నిలబడండి.. YSRCP శ్రేణులకు జగన్ పిలుపు

కోలీవుడ్ డైరెక్టర్స్ వైపే చూస్తున్న టాలీవుడ్ టాప్ హీరోస్

ఆళ్లగడ్డలో ఉద్రిక్తత.. ఇద్దరు ప్రపోజర్లు కిడ్నాప్

దీపావళి తర్వాత మూతపడనున్న పెట్రోల్ బంకులు? కారణం ఇదుకే..!

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)