Breaking News

పని ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులు.. గుండెపోటుతో వీఆర్వో మృతి

Published on Thu, 11/28/2024 - 05:41

రాజానగరం: తీవ్ర పని ఒత్తిడి, జీతాలందక ఆర్థిక ఇబ్బందులు ఒక వీఆర్వో ప్రాణాలు తీసుకున్నాయి. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం నరేంద్రపురం గ్రామ రెవెన్యూ అధికారి (వీఆర్వో), వీఆర్వోల సంఘం జిల్లా సంయుక్త కార్యదర్శి పెనుమాక గనిరాజు (47) బుధవారం గుండెపోటుతో మృతిచెందారు. విధి నిర్వహణలో భాగంగా మంగళవారం అర్ధరాత్రి వరకు పనిచేసిన ఆయనకు గుండెనొప్పి రావడంతో వెంటనే రాజమహేంద్రవరంలోని ఒక ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. 

అక్కడ చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతిచెందారు. కడియం మండలం జేగురుపాడుకు చెందిన గనిరాజుకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పని ఒత్తిళ్లు, ఆర్థిక ఇబ్బందులు ఉక్కిరిబిక్కిరి చేయడంతో గనిరాజు గుండెపోటుకు గురై మృతిచెందారని మండల వీఆర్వోల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు జాన్, ఎస్‌.శ్రీనివాస్‌ పేర్కొన్నారు. ఈ మేరకు రాష్ట్ర రెవెన్యూ మంత్రికి లేఖ రాశారు. అధికారులు అనేక పనులు పురమాయిస్తున్నారని తెలిపారు. 

దీనికితోడు టార్గెట్లు పూర్తిచేసే వరకు జీతాలు కూడా నిలిపేయడంతో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తోందని పేర్కొన్నారు. ఇంతవరకు అక్టోబర్‌ నెల జీతాలు రాలేదని తెలిపారు. దీంతో కుమార్తెల ఫీజు, ఇంటి అద్దె సకాలంలో చెల్లించలేక ఆవేదనతో ఉన్న గనిరాజు.. నీటిపన్నుల కలెక్షన్‌ డేటాను త్వరగా ఎంట్రీ చేయాలని అధికారులు ఫోన్‌లో ఆదేశించడంతో మంగళవారం అర్ధరాత్రి వరకు అదేపనిలో నిమగ్నమై గుండెపోటుకు గురయ్యారని వారు పేర్కొన్నారు.  

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)