Breaking News

హైదరాబాద్‌: పోలీసులకు చిక్కిన వెరైటీ దొంగ

Published on Wed, 12/27/2023 - 19:41

సాక్షి, హైదరాబాద్‌: ఓయూ పోలీసులకు ఓ వెరైటీ దొంగ చిక్కాడు. ఆ ఇంట్లో ఎంత దొంగతనం చేశాడో చీటీ కూడా రాసి పెడతాడు శంకర్ నాయక్..  అలాగే డైరీలో ఏ రోజు ఎవరి ఇంట్లో దొంగతనం చేశాడో కూడా రాసుకుంటాడు. ఇలా ఎందుకు చేస్తాడు అనుకుంటారా? పోలీసులకు తనపై తప్పుడు ఫిర్యాదు ఇవ్వకుండా ఇలా చేస్తాడని ఓయూ పోలీసులు తెలిపారు.

దొంగిలించబడ్డ సొమ్ముతో ముత్తూట్ గోల్డ్ లోన్‌లో తాకట్టు పెట్టి హోటల్స్‌లో విలాసవంతమైన  జీవితం గడుపుతూ, మిగిలిన ఆ డబ్బుతో  మళ్లీ దొంగతనం చేయడానికి  ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేసి, ఆ బండ్లపై దొంగతనం చేసే వెరైటీ దొంగ ఈ  శంకర్‌ నాయక్‌.

మహబూబ్‌నగర్‌కి చెందిన దొంగ శంకర్ నాయక్ గతంలో మేడిపల్లి పోలీస్ స్టేషన్లో పీడీ యాక్ట్ కేసు నమోదైంది. అయినా దొంగ బుద్ది మారలేదు, హబ్సిగూడ పరిధిలో మూడు దొంగతనాలు చేయడం దొంగిలించిన సొమ్ము ఎంత అనేది ఆ ఇంట్లో చీటీ రాసి మరి వెళతాడు. ఇప్పటివరకు 94 దొంగతనాలు చేసిన శంకర్ నాయక్ చివరికి ఓయూ పోలీసులకు చిక్కి మళ్లీ రిమాండ్ అయ్యాడు. అయితే రిమాండ్ చేసిన శంకర్‌ నాయక్‌ నుంచి 20 తులాల బంగారం, 2 బైక్స్, 3 మొబైల్ ఫోన్లు, డైరీ, చోరీకి ఉపయోగించిన వస్తువులు ఓయూ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చదవండి: బ్రేకప్‌ చెప్పాడని మాజీ ప్రియుడిపై కక్షతో

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)