Breaking News

భలే వెరైటీ లంచావతారం!

Published on Mon, 10/27/2025 - 15:05

తాడిని తన్నేవాడుంటే.. వాడి తలదన్నెవాడు ఇంకోడు అని పాతకాలపు సామెత. నేరుగా లంచాలు తీసుకునేందుకు జంకే, భయపడే ప్రభుత్వ ఉద్యోగులు... ఆ మొత్తాలను ఇంటావిడకు ఇమ్మని.. లేదా బంధువుల చేతుల్లో పెట్టమని అడగడం.. కొన్ని సందర్భాల్లో ఇవి కూడా విఫలమై అధికారులకు చిక్కిన వైనాల గురించి మనం తరచూ చూస్తూంటాం. ఈ వ్యవహారం కూడా అలాగే ఉంది. కాకపోతే.. ఈ సంఘటనలో లంచం తీసుకున్నది చాలా వెరైటీగా కావడం విశేషం. వివరాలు..

రాజస్థాన్‌లో రాజ్‌కాంప్‌ అని ఒక ప్రభుత్వ సంస్థ ఉంది. దీనికి ప్రద్యుమ్న దీక్షిత్‌ జాయింట్‌ డైరెక్టర్‌. ప్రభుత్వమన్నాక ఐటీలో కొన్ని పనులు చేపట్టడం.. వాటికి సంబంధించిన కాంట్రాక్టులు ప్రైవేటు వారికి ఇవ్వడం సహజమే. కానీ ఈయనగారు ఒక షరతుపై రెండు కాంట్రాక్టులను రెండు వేర్వేరు కంపెనీలకు ఇచ్చేశాడు. తన భార్యకు ఉత్తుత్తి ఉద్యోగం ఒకటి ఇవ్వడం.. నెల నెల జీతం కింద కొంత మొత్తం ఆమె బ్యాంకు ఖాతాలో జమ చేయడమే ఈ షరతు. రెండు కంపెనీలు దీనికి ఒప్పుకున్నాయి. కాంట్రాక్టు దక్కించుకున్నాయి. 

రెండేళ్లు గడచిపోయాయి. ప్రద్యుమ్న దీక్షిత్‌ భార్య పూనమ్‌ దీక్షిత్‌.. కడుపులో చల్ల కదలకుండా ఇంట్లోనే కూర్చుని ఉంటోంది. నెల తిరక్కముందే ఆమె బ్యాంకు ఖాతాలోకి డబ్బులు వచ్చిపడుతున్నాయి. ఏదైనా పాపం పండే వరకే అంటారు కదా.. అలాగే ఈ వ్యవహారం కూడా ఎట్టకేలకు బట్టబయలైంది. రాజస్థాన్‌ హైకోర్టు గత ఏడాది ఐటీ కాంట్రాక్టులు పొందిన సంస్థలపై దర్యాప్తు జరపాలని ఒక ఆదేశం జారీ చేసింది. 

అటు.. ఇటు తిరిగి ఈ విచారణ కాస్తా ఈ ఏడాది జూలైలో మొదలైంది. 2019 జనవరి నుంచి 2020 సెప్టెంబరు వరకూ పూనమ్‌ దీక్షిత్‌కు రెండు కంపెనీల నుంచి సుమారు రూ.38 లక్షల రూపాయల వరకూ ముట్టినట్లు అధికారులు లెక్కలు తేల్చారు. ఈ 21 నెలల కాలంలో ఆమె ఒక్కసారి కూడా ఆయా ఆఫీసుల గడప తొక్కిన పాపాన పోకపోవడం ఇంకో విశేషం. అంతేకాదు... ఆమె నిజంగానే ఉద్యోగం చేస్తోందన్న భ్రమ కల్పించేందుకు ప్రద్యుమ్న స్వయంగా అటెండెన్స్‌కు సంబంధించిన మెయిళ్లు అప్రూవ్‌ చేసినట్లుగా విచారణలో వెల్లడైంది.

ఒక కంపెనీ నుంచి ఫ్రీలాన్సింగ్‌ పేరుతో.. ఇంకో కంపెనీ నుంచి జీతం పేరుతో ఈమె ఖాతాలోకి డబ్బులు వచ్చినట్లు స్పష్టమైంది. కంపెనీ రికార్డులు.. పూనమ్‌ బ్యాంకు ఖాతాలను పరిశీలించిన తరువాత రాజస్థాన్‌ అవినీతి నిరోధక శాఖ అధికారులు ప్రద్యుమ్న దీక్షిత్‌పై ఈ నెల 17న కేసు నమోదు చేశారు.

- గిళియారు గోపాలకృష్ణ మయ్యా
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)