Breaking News

యువకుల ప్రాణం తీసిన ఫ్లెక్సీలు

Published on Fri, 12/27/2024 - 00:55

కొల్చారం (నర్సాపూర్‌): విద్యుదాఘాతంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన మెదక్‌ జిల్లా కొల్చారం మండలంలో చోటు చేసుకుంది. కొల్చారం ఎస్‌ఐ మహ మ్మద్‌ గౌస్‌ కథనం ప్రకా రం.. కిష్టాపూర్‌ గ్రామా నికి చెందిన ఎక్కెం యాదగిరి కుమారుడు నవీన్‌ (21), పసుపుల చిన్న వెంకటేశం కుమారుడు పసుపుల ప్రసాద్‌ (20) వారి వ్యవసాయ పొలంలో నారు మడికి నీరు పెట్టి, అడవి పందులు రాకుండా మంటలు పెట్టడానికి వెళ్లారు. కాగా, బుధవారం మెదక్‌ జిల్లాకు సీఎం రేవంత్‌రెడ్డి రాక సందర్భంగా వీరి పొలాలకు సమీపంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

ఫ్లెక్సీలు విద్యుత్‌ హైటెన్షన్‌ వైర్‌కు ఆనుకొని ఉండటంతో వాటిని ఏర్పాటు చేసిన కాంట్రాక్టర్‌ తీయకుండా వదిలేశాడు. అయితే, ప్రసాద్, నవీన్‌ ఫ్లెక్సీలు తీయడానికి ప్రయతి్నంచగా విద్యుత్‌ సరఫరా కావడంతో కరెంట్‌ షాక్‌ కొట్టి అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు, కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఘటనా స్థలానికి చేరుకొని నిర్లక్ష్యంగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ మెదక్‌–నర్సాపూర్‌ జాతీ య రహదారిపై రాస్తారోకో చేశారు. విషయం తెలుసుకున్న మెదక్‌ డీఎస్పీ ప్రసన్నకుమార్, రూరల్‌ సీఐ రాజశేఖర్‌రెడ్డి అక్కడికి చేరుకొని బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా చూస్తామని భరోసా ఇవ్వడంతో శాంతించారు.

 ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. ఇద్దరు యువకులు ఒకేసారి మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. మృతుల్లో ఒకరైన ప్రసాద్‌కి ఇటీవలే పెళ్లి కుదిరినట్లు గ్రామస్తులు తెలిపారు. టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి, నర్సాపూర్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆవుల రాజిరెడ్డి మెదక్‌ చేరుకొని యువకుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. తక్షణ సాయం కింద ఒక్కో కుటుంబానికి రూ.25 వేల చొప్పు న అందజేశారు.

Videos

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)