Breaking News

యువతి ఆత్మహత్య.. ఆమెను రక్షించబోయి స్నేహితురాలి దుర్మరణం

Published on Tue, 12/17/2024 - 04:21

పెనుకొండ: ఓ యువతి ఆత్మహత్యచేసుకుంటుంటే.. ఆమెను కాపాడుకునే క్రమంలో మరో యువతి దుర్మరణం పాలైంది. మృతులిద్దరూ ఒడిశాకు చెందిన యువతులు. ఒడిశాలోని గంజాం జిల్లాకు చెందిన సంధ్యారాణి మహారాజ్‌(24), సుల్లు­బుల్లు బెహరా(28)లు స్నేహితులు. బతుకు తెరువు కోసం ఇద్దరూ బెంగళూరులోని ఓ గార్మెంట్స్‌ పరిశ్రమలో పనిచేస్తున్నారు. 3 రోజుల కిందట సంధ్యారాణి తండ్రి కుటుంబ సమస్యలతో ఆత్మహత్య చేసుకున్నాడు.

విషయం తెలుసుకున్న సంధ్యారాణి సొంతూరికి పయనమైంది. ఆమెకు తోడుగా సుల్లుబుల్లు బెహరా కూడా బయలుదేరింది. ఆదివారం బెంగళూరు నుంచి ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌లో వీరు బయలుదేరారు. తానూ నాన్న దగ్గరికే వెళతానంటూ స్నేహితురాలితో సంధ్యారాణి చెప్పింది. పెనుకొండ రైల్వేస్టేషన్‌కు రైలు చేరగానే సంధ్యారాణి రైలు దిగేసింది. 

బెహరా కూడా రైలు దిగి ఆమెను ఓదార్చేందుకు ప్రయత్నించింది. ఈ లోపు సంధ్యారాణి ప్లాట్‌ఫారం దాటి ముందుకు వెళుతుండడంతో వెను­కనే బెహరా అనుసరించింది. అటుగా వచి్చన గూడ్స్‌ రైలును గమనించగానే సంధ్యారాణి పట్టాల మీదికి దూకేసింది. ఆమెను పట్టుకునే క్రమంలో బెహరా సైతం అడుగు ముందుకేయడంతో.. రైలు ఇంజన్‌ ఢీకొట్టి బెహరా ఎగిరి పట్టాలు పక్కనే పడి ప్రాణాలు విడిచింది. రైలు కిందపడిన సంధ్యారాణి శరీరం ఛిద్రమై ప్రాణాలు కోల్పోయింది.

#

Tags : 1

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)