Breaking News

ఆహారం వడ్డింపులో జాప్యం.. ఇద్దరి హత్య

Published on Sat, 01/31/2026 - 13:18

ఘజియాబాద్‌: ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఖోడా ప్రాంతంలోని ఒక హోటల్‌లో ఆర్డర్ చేసిన ఆహారం రావడం ఆలస్యమైందన్న చిన్న కారణంతో మొదలైన వివాదం  ఇద్దరి ప్రాణాలను బలితీసుకునేవరకూ వెళ్లింది. శుక్రవారం అర్థరాత్రి దాటిన తర్వాత ఈ దారుణ ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృతులను బహ్రైచ్ జిల్లాకు చెందిన శ్రీపాల్ (25), సత్యం (26)గా పోలీసులు గుర్తించారు. వీరు ఖోడాలోని నెహ్రూ విహార్ కాలనీలో నివాసం ఉంటున్నట్లు సమాచారం.

పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం.. ఘటన జరిగిన సమయంలో రెండు వర్గాలకు చెందిన యువకులు మద్యం మత్తులో ఉన్నారు. ఆర్డర్ చేసిన భోజనం వడ్డించడంలో జాప్యం జరగడంతో  ఇరు గ్రూపులవారు ఒకవైపు హోటల్ సిబ్బందితోను, మరోపైపు పరస్పర వర్గంతోను వాగ్వాదానికి దిగారు. ఇది క్షణాల్లో పెను వివాదంగా మారి, ఇరు వర్గాలు పరస్పరం పదునైన ఆయుధాలతో దాడి చేసుకునేవరకూ దారి తీసింది. హోటల్ ప్రాంగణంలో రక్తం చిందింది.

స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఘటనలో తీవ్రంగా గాయపడిన ముగ్గురు యువకులను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే  శ్రీపాల్, సత్యంలు మృతి చెందినట్లు వైద్యులు వైద్యులు ప్రకటించారు. మూడవ వ్యక్తికి తీవ్రమైన గాయాలు కావడంతో పాటు, అతను కూడా మద్యం మత్తులో ఉండటంతో అతని వివరాలు ఇంకా తెలియరాలేదు. ప్రస్తుతం అతను ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నాడు.

ఈ ఘటనపై డిసిపి నిమిష్ పాటిల్ మాట్లాడుతూ, కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు వేగవంతం చేసినట్లు తెలిపారు. ఈ ఘటనతో సంబంధం ఉన్నట్లు భావిస్తున్న నలుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా మిగిలిన నిందితులను కూడా త్వరలోనే పట్టుకుంటామని అధికారులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

ఇది కూడా చదవండి: ర్యాగింగ్ కలకలం.. ఎనిమిది మంది మెడికోలపై వేటు
 

Videos

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

తిరుపతిలో దొంగల బీభత్సం 90 గ్రాముల బంగారం చోరీ!

టీడీపీ దాడులకు భయపడే ప్రసక్తేలేదు.. సజ్జల మాస్ వార్నింగ్

వైరల్ అవుతున్న వీడియో, దారుణం.. వెంటబడి మరి TDP గూండాల అరాచకం

టీడీపీ గూండాలు... కడపలో కత్తిపోట్లు.. పులివెందులలో కాల్పుల కలకలం

ఒక్కొక్కడి పేరు అడ్రస్ నోట్ చేస్తున్న.. సిగ్గు లేకుండా ఫోన్ ఆఫ్ చేసి పారిపోయారు

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)