Breaking News

సీఎంఆర్‌ హాస్టల్‌ ఘటనలో ఇద్దరి రిమాండ్‌

Published on Mon, 01/06/2025 - 04:55

మేడ్చల్‌రూరల్‌: గర్ల్స్‌ హాస్టల్‌లోని బాత్‌రూంలో వీడియోల చిత్రీకరణ ఘటనలో మేడ్చల్‌ పోలీసులు ఇద్దరిని రిమాండ్‌ చేశారు. మేడ్చల్‌ ఎమ్మెల్యే మల్లారెడ్డి సోదరుడు, సీఎంఆర్‌ గ్రూప్స్‌ చైర్మన్‌ గోపాల్‌రెడ్డి సహా మరో ఐదుగురిపై కేసు నమోదు చేశారు. మేడ్చల్‌ డీసీపీ కోటిరెడ్డి  తెలిపిన వివరాల ప్రకారం...కండ్లకోయలోని సీఎంఆర్‌ ఐటీ కళాశాల గర్ల్స్‌ హాస్టల్‌లో డిసెంబర్‌ 31 రాత్రి బాత్‌రూంలోకి ఓ విద్యార్థిని వెళ్లగా, ఆ సమయంలో ఎవరో వెంటిలెటర్‌ నుంచి తొంగి చూస్తున్నట్టు గుర్తించింది. 

ఈ విషయాన్ని హాస్టల్‌ వార్డెన్‌ దృష్టికి తీసుకెళ్లగా, సకాలంలో స్పందించలేదు. దీంతో హాస్టల్‌లోని విద్యార్థినులు ఆందోళన బాట పట్టారు. ఇది రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. జరిగిన ఘటనను రాష్ట్ర మహిళా కమిషన్‌ సుమోటోగా స్వీకరించి కళాశాలకు నోటీసులు జారీ చేసి విచారణ జరిపింది. విద్యార్థినుల ఫిర్యాదు మేరకు మేడ్చల్‌ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. బిహార్‌కు చెందిన కిశోర్‌కుమార్, గోవింద్‌కుమార్‌తో పాటు మరికొందరు మెస్‌లో పనిచేస్తున్నారు. 

హాస్టల్‌ వెనుక భాగంలో యాజమాన్యం ఏర్పాటు చేసిన గదుల్లో వారు ఉంటున్నారు. విద్యార్థుల ఆరోపణలు, ఆందోళన నేపథ్యంలో మెస్‌లో పనిచేసే ఐదుగురిని అదుపులోకి తీసుకొని విచారించగా, కిశోర్‌కుమార్, గోవింద్‌కుమార్‌లు బాత్‌రూం వెంటిలేటర్‌ ద్వారా తొంగి చూసినట్టు నేరం అంగీకరించారు. దీంతో వారిపై పోక్సో కేసు నమోదు చేసి ఆదివారం రిమాండ్‌కు తరలించారు. విద్యార్థినులు ఫిర్యాదు చేసిన సమయంలో వారిని కించపరుస్తూ మాట్లాడిన హాస్టల్‌ వార్డెన్లు ప్రీతిరెడ్డి, ధనలక్ష్మిలపై కూడా కేసు నమోదు చేశారు. 

జరిగిన ఘటనను బయటకు రాకుండా చూడాలని, పోలీసులు, విద్యార్థినుల తల్లిదండ్రులకు సమాచారం చేరకుండా చూసుకోవాలని హాస్టల్‌ వార్డెన్‌లపై ఒత్తిడి తీసుకొచ్చిన సీఎంఆర్‌ సెట్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ నారాయణ, సీఎంఆర్‌ ఐటీ కళాశాల డైరెక్టర్‌ మాదిరెడ్డి జంగారెడ్డి, సీఎంఆర్‌ విద్యాసంస్థల చైర్మన్‌ గోపాల్‌రెడ్డిలపై కూడా కేసు నమోదు చేశారు.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)