Breaking News

వారణాసిలో ఏపీకి చెందిన అన్నదమ్ముల బలవన్మరణం

Published on Thu, 09/12/2024 - 11:52

వారణాసి/ఏలూరు: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు అన్నదమ్ములు వారణాసిలో ఆత్మహత్య చేసుకున్నారు. ఆర్థిక ఇబ్బందులు తాళలేక సెల్ఫీ వీడియోలు తీసి ఆత్మహత్య చేసుకోవడంతో విషాదం నెలకొంది.  

పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఏలూరు జిల్లా ఉంగటూరులోని నారాయణపురానికి చెందిన అన్న దమ్ములు వినోద్‌, లక్ష్మీనారాయణలు రియల్‌ ఎస్టేట్‌,ఫైనాన్స్‌ వ్యాపారం చేస్తుండేవారు. వ్యాపార నిర్వహణకు స్నేహితులు, స్థానికుల వద్ద అప్పులు చేశారు.

అయితే వ్యాపారంలో నష్టాలు రావడం, తమ డబ్బులు ఇవ్వాలంటూ ఒత్తిడి చేయడంతో అన్నదమ్ములు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు .అనంతరం ఏపీ నుంచి వారణాసికి వెళ్లారు. అక్కడ ఆంధ్రా ఆశ్రమంలో గదిని అద్దెకు తీసుకుని.. అందులోనే ఉంటున్నారు.

ఇదీ చదవండి : ప్రశ్నార్ధకంగా విశాఖ ఉక్కు పరిశ్రమ

ఈ తరుణంలో వ్యాపారంలో నష్టాలు, అప్పులు ఇచ్చిన వారిని నుంచి ఒత్తిడి పెరిగిపోతుందని, తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు సెల్ఫీ వీడియో తీశారు. ప్రాణాలు పోగొట్టుకున్నారు. సెల్ఫీ వీడియోపై సమాచారం అందుకున్న వారాణాసి పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. అప్పటికే అన్నదమ్ములిద్దరు ప్రాణాలు విడిచినట్లు నిర్ధారించారు. అన్నదమ్ముల మృతిపై ఏపీలోని వారి తల్లిదండ్రులకు సమాచారం అందించారు.   

ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. 
ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001 
మెయిల్: roshnihelp@gmail.com
 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)